Egg Bhurji: ధాబా స్టైల్‌లో ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు..

కోడి గుడ్డు అంటే అందరికీ చాలా ఇష్టంగా తింటారు. గుడ్డుతో కొన్ని వందల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. స్నాక్స్‌ కూడా తయారు చేసుకోవచ్చు. ప్రతి రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. ఎగ్‌తో ఈజీగా సింపుల్‌గా చేసుకునే వంటకాల్లో ఎగ్ భుర్జీ కూడా ఒకటి. చాలా మందికి ఇది అంటే ఇష్టం. ఇంట్లో చేసుకునే దాని కంటే ధాబాల్లో చేసే ఎగ్ భుర్జీ..

Egg Bhurji: ధాబా స్టైల్‌లో ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు..
Egg Bhurji
Follow us
Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 07, 2024 | 10:40 PM

కోడి గుడ్డు అంటే అందరికీ చాలా ఇష్టంగా తింటారు. గుడ్డుతో కొన్ని వందల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. స్నాక్స్‌ కూడా తయారు చేసుకోవచ్చు. ప్రతి రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. ఎగ్‌తో ఈజీగా సింపుల్‌గా చేసుకునే వంటకాల్లో ఎగ్ భుర్జీ కూడా ఒకటి. చాలా మందికి ఇది అంటే ఇష్టం. ఇంట్లో చేసుకునే దాని కంటే ధాబాల్లో చేసే ఎగ్ భుర్జీ చాలా రుచిగా ఉంటుంది. ఈ స్టైల్‌ రెసిపినీ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే స్టైల్‌లో చేస్తే త్వరగా అయిపోతుంది. రుచి కూడా అచ్చం అలా తిన్నట్టే ఉంటుంది. మరి ఈ ధాబా స్టైల్ ఎగ్ భుర్జీ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ భుర్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, క్యాప్సికమ్, టమాటా, నెయ్యి లేదా నూనె లేదా బటర్, గరం మసాలా, కొత్తి మీర, కరివేపాకు, నిమ్మరసం.

ఎగ్ భుర్జీ తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ చేసి బటర్ లేదా నెయ్యి లేదా నూనె కానీ వేయండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసి వేయించాక అందులోనే ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి ఎర్రగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఓ నిమిషం పాటు వేయించాక.. టమాటాల ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత పసుపు, కారం ఉప్పు వేసి బాగా వేగాక.. కోడి గుడ్లు వేసి చిన్న చిన్న ముక్కలుగా ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

కూరగాయ ముక్కలతో పాటు దీన్ని కూడా ఆయిల్‌లో బాగా వేయించాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి. చివరగా కొత్తిమీర చల్లి గార్నిష్ చేయాలి. ఆ తర్వాత కావాలి అనుకుంటే నిమ్మరసం పిండాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ధాబా స్టైల్‌ ఎగ్ భుర్జీ సిద్ధం. ఈ భుర్జీని పులావ్, రోటీలు, పుల్కాలు, అన్నం వేటితో అయినా తినవచ్చు. మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.