Black Mutton Curry: నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
మటన్ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం. ఈ మటన్ కర్రీని ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. మటన్ వేపుడు అయితే మరింత రుచిగా ఉంటుంది. ఫంక్షన్స్‌లో మటన్ కర్రీ పెడితే ఎన్నో గొడవలు కూడా జరిగాయి. మటన్ అందరూ తినలేదరు. ఖరీదు ఎక్కువే. మటన్ లవర్స్ ఇప్పటికే ఎన్నో రకాల వంటకాలు ట్రై చేసే ఉంటారు. ఈ సారి ఈ బ్లాక్ మటన్ మసాలా వండండి. చాలా రుచిగా ఉంటుంది. పులావ్, చపాతీ, రోటీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీకి మసాలాలు బాగా..
మటన్ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం. ఈ మటన్ కర్రీని ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. మటన్ వేపుడు అయితే మరింత రుచిగా ఉంటుంది. ఫంక్షన్స్‌లో మటన్ కర్రీ పెడితే ఎన్నో గొడవలు కూడా జరిగాయి. మటన్ అందరూ తినలేదరు. ఖరీదు ఎక్కువే. మటన్ లవర్స్ ఇప్పటికే ఎన్నో రకాల వంటకాలు ట్రై చేసే ఉంటారు. ఈ సారి ఈ బ్లాక్ మటన్ మసాలా వండండి. చాలా రుచిగా ఉంటుంది. పులావ్, చపాతీ, రోటీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీకి మసాలాలు బాగా దట్టించి చేస్తారు. ఇది చేయడం కూడా చాలా సులభమే. పెద్దగా సమయం కూడా పట్టదు. ఇంత రుచికరమైన బ్లాక్ మటన్ కర్రీని ఎలా తయారు చేస్తారు? ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు:
మటన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి, సోంపు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, గసగసాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఎండు మిర్చి, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, కసూరి మేతి, బంగాళదుంపలు, పెరుగు, చింత పండు రసం, పుదీనా, ఆయిల్.
బ్లాక్ మటన్ కర్రీ తయారీ విధానం:
ముందుగా మటన్ మ్యారినేట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో పసుపు, పెరుగు, ఉప్పు, కొద్దిగా కారం వేసి కలిపి ఓ గంట పాటు పక్కన పెట్టుకోండి. మ్యారినేట్ అయ్యాక ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, మటన్, నీళ్లు వేసి ఓ రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. కుక్కర్ వేడి చల్లారే లోపు .. ఒక కడాయి తీసుకోండి. ఇందులో కొద్దిగా ఉల్లి ముక్కలు వేసి కలర్ మారేంత వరకు వేయించండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, అల్లం, గసగసాలు, దాల్చిన చెక్క, మిరియాలు, వెల్లుల్లి వేసి వేయించి చల్లార్చాలి.
ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్‌లోకి వేసి మెత్తగా పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవలె. నెక్ట్స్ ఇదే కడాయిలో ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు వేసి వేయించాలి తర్వాత వెల్లుల్లి, అల్లం తరుగు వేసి ఫ్రై చేయాలి. ఇవి కాస్త రంగు మారాక ఉడికించిన ఆలు గడ్డల ముక్కలను వేసి కలపాలి. ఇవి కూడా వేగాక.. మటన్ ముక్కలను వేసి బాగా మిక్స్ చేయాలి. మటన్ ఓ రెండు నిమిషాలు వేయించాక.. ఇప్పుడు మీక్సీ పట్టిన పేస్టు, చింత పండు రసం, నీళ్లు వేసి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికి దగ్గర పడ్డాక.. పుదీనా తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బ్లాక్ మటన్ కర్రీ సిద్ధం. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది.