Beerakaya Kodiguddu Kheema: సమ్మర్ బెస్ట్ రెసిపీ.. బీరకాయ కోడిగుడ్డు కీమా..

బీర కాయ కోడి గుడ్డు కీమా.. కాంబినేషనే స్పెషల్‌గా ఉంది కాదూ. కానీ ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. బీరకాయ కోడి గుడ్డు కీమా రెసిపీ.. రుచి చూస్తే మాత్రం అస్సలు వదిలి పెట్టరు. వైరాటీగానే కాకుండా సమ్మర్‌కి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇందులో పోషక విలువలతో పాటు నీటి శాతం కూడా ఉంటుంది. దీన్ని అన్నం, చపాతీ, పూరీలతో తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఈజీగా అయ్యే సింపుల్ రెసిపీ కూడా. బ్యాచిలర్స్ కూడా త్వరగా చేసేసుకోవచ్చు. హడావిడిలో ఉన్నప్పుడు..

Beerakaya Kodiguddu Kheema: సమ్మర్ బెస్ట్ రెసిపీ.. బీరకాయ కోడిగుడ్డు కీమా..
Beerakaya Kodiguddu Kheema
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 23, 2024 | 11:15 PM

బీర కాయ కోడి గుడ్డు కీమా.. కాంబినేషనే స్పెషల్‌గా ఉంది కాదూ. కానీ ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. బీరకాయ కోడి గుడ్డు కీమా రెసిపీ.. రుచి చూస్తే మాత్రం అస్సలు వదిలి పెట్టరు. వైరాటీగానే కాకుండా సమ్మర్‌కి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇందులో పోషక విలువలతో పాటు నీటి శాతం కూడా ఉంటుంది. దీన్ని అన్నం, చపాతీ, పూరీలతో తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఈజీగా అయ్యే సింపుల్ రెసిపీ కూడా. బ్యాచిలర్స్ కూడా త్వరగా చేసేసుకోవచ్చు. హడావిడిలో ఉన్నప్పుడు ఈ కూర చేసుకుంటే చాలు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బీరకాయ కోడి గుడ్డు కీమాకి కావాల్సిన పదార్థాలు:

బీరకాయ, కోడి గుడ్లు, పచ్చి మిర్చి, ఉల్లి పాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తి మీర, ఎండు మిర్చి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్.

బీరకాయ కోడి గుడ్డు కీమా తయారీ విధానం:

ముందుగా బీరకాయ తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను, పచ్చి మిర్చి కూడా ముక్కలు చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కాక.. జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి తాళింపు పెట్టాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చి మిర్చి తరుగు కూడా వేసి పచ్చి కలర్ మారేంత వరకూ ఫ్రై చేయాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి నీరంతా ఇంకేదాకా బాగా ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి సిమ్‌లో పెట్టి వేయించాలి. ఇప్పుడు కోడిగుడ్లు వేసి ఓ రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. ఆ తర్వాత మూత తీసి.. గరిటతో బాగా కలపాలి. చివరిగా కొత్తి మీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో సింపుల్ డిష్ సిద్ధం. ఇది తినడం ఎంతో ఆరోగ్యం కూడా. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టండి.. వావ్ అంటారు.