AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌గా కోడిగుడ్డు గుంత పొంగనాలు.. టేస్ట్‌ చేస్తే వదలరు!

ఉదయం బ్రేక్ ఫాస్ట్ హెల్దీగా ఉండాలని.. అలాగే గట్టిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్వం అయితే సద్దన్నం .. మిల్లేట్స్‌తో చేసే ఆహారాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది. వెరైటీగా.. హెల్దీగా తినాలి అనుకుంటున్నారు. ఎప్పుడూ తిన్నవే కాకుండా.. డిఫరెంట్‌గా ఉండాలని చూస్తారు. అలాంటి రెసిపీల్లో ఈ కోడి గుడ్డు గుంత పొంగనాలు కూడా ఒకటి. సాధారణంగా గుంత పొంగనాలు చేస్తూ ఉంటారు. కానీ వెరైటీగా.. హెల్దీగా ఉండే ఈ ఎగ్ గుంత పొంగనాలు కాస్త డిఫరెంట్. వీటిని కొద్దిగా తీసుకున్నా..

Healthy Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌గా కోడిగుడ్డు గుంత పొంగనాలు.. టేస్ట్‌ చేస్తే వదలరు!
Egg Gunta Ponganalu
Chinni Enni
| Edited By: |

Updated on: Jul 23, 2024 | 11:30 PM

Share

ఉదయం బ్రేక్ ఫాస్ట్ హెల్దీగా ఉండాలని.. అలాగే గట్టిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్వం అయితే సద్దన్నం .. మిల్లేట్స్‌తో చేసే ఆహారాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది. వెరైటీగా.. హెల్దీగా తినాలి అనుకుంటున్నారు. ఎప్పుడూ తిన్నవే కాకుండా.. డిఫరెంట్‌గా ఉండాలని చూస్తారు. అలాంటి రెసిపీల్లో ఈ కోడి గుడ్డు గుంత పొంగనాలు కూడా ఒకటి. సాధారణంగా గుంత పొంగనాలు చేస్తూ ఉంటారు. కానీ వెరైటీగా.. హెల్దీగా ఉండే ఈ ఎగ్ గుంత పొంగనాలు కాస్త డిఫరెంట్. వీటిని కొద్దిగా తీసుకున్నా.. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే హెల్దీ రెసిపీ కూడా. ఈ ఎగ్ పొంగనాలతో ప్రత్యేకంగా చట్నీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌ను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కోడిగుడ్డు గుంత పొంగనాలకు కావాల్సిన పదార్థాలు:

కోడిగుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, నిమ్మరసం, మిరియాల పొడి.

కోడిగుడ్డు గుంత పొంగనాలు తయారీ విధానం:

ముందుగా కోడి గుడ్లను ఓ గిన్నెలోకి చితక కొట్టి వేయాలి. తర్వాత వీటిని బాగా బీట్ చేయాలి. నెక్ట్స్ ఉల్లిపాయలను సన్నగా తరిగి అందులో వేయాలి. ఆ తర్వాత పచ్చి మిర్చి ముక్కలు, కొత్తి మీర కూడా వేసి ముందు వీటిని బాగా గిలక్కొట్టాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. గుంత పొంగనాల పాన్ తీసుకుని పెట్టాలి. కొద్ది ఆయిల్ రాసి.. పాన్ వేడి చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మంటను మీడియంలో మెట్టి.. ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని కొద్దిగా వేయాలి. ఎందుకంటే కోడి గుడ్డు పొంగుతుంది. అలాగే ఇవి త్వరగా మాడిపోతాయి. కాబట్టి తక్కువ మంట పెట్టాలి. మధ్యలో రెండో వైపుకు కూడా తిరగేయాలి. ఆ తర్వాత ఉడికాయో లేదో చెక్ చేసుకుని.. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవడమే. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ గుంత పొంగనాలు సిద్ధం. వీటిని స్నాక్‌లా కూడా తీసుకోవచ్చు.

ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో