Chicken Fry: ఇలా చికెన్ ఫ్రై ఒక్కసారి చేశారంటే.. టేస్ట్ అస్సలు మర్చిపోరు..

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్ ప్రియులు ఎక్కువగానే ఉన్నారు. మటన్ కంటే ఎక్కువగా చికెన్ తినే వాళ్లే ఎక్కువ. చికెన్‌తో పరోటాలు, స్నాక్స్, ఎన్నో రకాల కర్రీస్, వెరైటీ బిర్యానీలు, సూప్స్ ఒక్కటేంటీ.. చాలా తయారు చేసుకోవచ్చు. అందులోనూ చికెన్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. సైడ్ డిష్‌గా ఉంటుంది. ఇది సేమీ గ్రీవీలా కూడా చేసుకోవచ్చు. అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడం కూడా సులభం. ఇప్పటికే మీరు ఎన్నో రకాల చికెన్..

Chicken Fry: ఇలా చికెన్ ఫ్రై ఒక్కసారి చేశారంటే.. టేస్ట్ అస్సలు మర్చిపోరు..
Chicken Fry
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 23, 2024 | 11:45 PM

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్ ప్రియులు ఎక్కువగానే ఉన్నారు. మటన్ కంటే ఎక్కువగా చికెన్ తినే వాళ్లే ఎక్కువ. చికెన్‌తో పరోటాలు, స్నాక్స్, ఎన్నో రకాల కర్రీస్, వెరైటీ బిర్యానీలు, సూప్స్ ఒక్కటేంటీ.. చాలా తయారు చేసుకోవచ్చు. అందులోనూ చికెన్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. సైడ్ డిష్‌గా ఉంటుంది. ఇది సేమీ గ్రీవీలా కూడా చేసుకోవచ్చు. అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడం కూడా సులభం. ఇప్పటికే మీరు ఎన్నో రకాల చికెన్ ఫ్రైలు తినే ఉంటారు. కానీ ఈసారి ఇలా కొత్తగా ఒక్కసారి చికెన్ ఫ్రై ట్రై చేయండి. నిద్రలో కూడా టేస్ట్‌ని మర్చిపోరు. అంత రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై చేసుకోవడం కూడా ఈజీనే. బ్యాచిలర్స్, వంట రాని వాళ్లు సైతం సింపుల్‌గా, ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డిఫరెంట్ స్టైల్ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

చికెన్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తి మీర, కరివేపాకు, ఆయిల్, ఉల్లిపాయలు, పెరుగు, పచ్చి మిర్చి, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి.

డిఫరెంట్ స్టైల్ చికెన్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా చికెన్‌ని శుభ్రంగా క్లీన్ చేసుకుని.. కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి.. ఓ రెండు గంటల సేపైనా మ్యారినేట్ చేసుకోవాలి. టైమ్ లేని వారు నేరుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ తర్వాత చికెన్ వేసి కలపాలి. ఇప్పుడు పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్‌లో ఉండే వాటర్ అంతా పోయేదాకా.. ఆయిల్ పైకి తేలేంత వరకూ చికెన్ కుక్ చేసుకోవాలి. ఆ నెక్ట్స్ ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. మధ్య మధ్యలో చికెన్ కలుపుతూ.. మెత్తగా, కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఈ సమయంలో కొత్తి మీర తప్పించి.. మిగిలిన అన్ని పదార్థాలు వేసి.. ఓ రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉంటే చికెన్ ఫ్రై సిద్ధం. కావాలి అనుకునే వారు నిమ్మ రసం కూడా పిండుకోవచ్చు. ఇలా ఫ్రైతో అన్నం తిన్నా లేక రసంతో తిన్నా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.