AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Kabab: టేస్టీ టేస్టీ చికెన్ కబాబ్స్.. తింటే వావ్ అనక తప్పదు..

చికెన్‌తో ఎన్నో రకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసినా చికెన్ రుచి మాత్రం వేరే లెవల్‌లో ఉంటుంది. రెస్టారెంట్‌లో చికెన్‌తో ఎన్నో రుచికరమైనవి తయారు చేస్తూ ఉంటారు. వాటిల్లో ఈ చికెన్ కబాబ్స్ కూడా ఒకటి. ఇవి అంటే చాలా మందికి ఇష్టం. కానీ అస్తమానూ రెస్టారెంట్లకు వెళ్లి తినలేం. అలాగే బయట తినడం అంత ఆరోగ్యకరం కూడా కాదు. కాబట్టి వీటిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఆరోగ్య కరంగా ఉంటాయి. మరి ఈ టేస్టీ టేస్టీ..

Chicken Kabab: టేస్టీ టేస్టీ చికెన్ కబాబ్స్.. తింటే వావ్ అనక తప్పదు..
Chicken Kabab
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 27, 2024 | 6:00 PM

Share

చికెన్‌తో ఎన్నో రకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసినా చికెన్ రుచి మాత్రం వేరే లెవల్‌లో ఉంటుంది. రెస్టారెంట్‌లో చికెన్‌తో ఎన్నో రుచికరమైనవి తయారు చేస్తూ ఉంటారు. వాటిల్లో ఈ చికెన్ కబాబ్స్ కూడా ఒకటి. ఇవి అంటే చాలా మందికి ఇష్టం. కానీ అస్తమానూ రెస్టారెంట్లకు వెళ్లి తినలేం. అలాగే బయట తినడం అంత ఆరోగ్యకరం కూడా కాదు. కాబట్టి వీటిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఆరోగ్య కరంగా ఉంటాయి. మరి ఈ టేస్టీ టేస్టీ చికెన్‌ కబాబ్స్‌ని ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ కాబాబ్స్‌కి కావాల్సిన పదార్థాలు:

చికెన్ కీమా, అల్లం, వెల్లుల్లి, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, పచ్చి మిర్చి, పుదీనా, కొత్తి మీర, జీలకర్ర, ఆయిల్, లవంగాలు, శనగ పప్పు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, ధనియాలు, కారం, గుడ్లు.

చికెన్ కాబాబ్స్‌ తయారీ విధానం:

ముందుగా శనగపప్పును శుభ్రంగా కడిగి ఓ గంట సేపు నాన బెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. జీలకర్ర, లవంగాలు, ఎండు మిర్చి, దాల్చిన చెక్క, కొత్తి మీర, కారం, నల్ల మిరియాలు అన్నీ వేసి.. రెండు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత ఇందులో నానబెట్టిన శనగపప్పు, చికెన్ కీమాను కూడా వేసి బాగా కలిపాలి. ఇప్పుడు కావాల్సినంత నీరు వేసి.. కుక్కర్ మూత పెట్టి.. ఓ ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

నెక్ట్స్ స్టవ్ ఆఫ్ చేసి.. కుక్కర్‌ మూత తీసి చల్లారాకా.. మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇందులోనే తరిగిన పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు, కొత్తి మీర తరుగు, పుదీనా ఆకులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే రెండు కోడి గుడ్లు కూడా చితకొట్టి.. మరోసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి.. ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన షేపులో కబాబ్స్‌లో చేసి.. పెనం మీద పెట్టి.. చిన్న మంటపై రెండువైపులా ఎర్రగా వేయించాలి. అంతే ఎంతో టేస్టీ చికెన్ కబాబ్స్ రెడీ.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్