Aloo Dum Biryani: హైదరాబాదీ ఆలూ దమ్ బిర్యానీ ఇలా చేశారంటే.. ఇల్లంతా సువాసనలే..
హైదరాబాద్ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీనే. కేవలం నాన్ వెజ్ బిర్యానీలే కాకుండా.. ఆలూ దమ్ బిర్యానీ కూడా ఫేమస్. వెజిటేరియన్ లవర్స్ ఫేవరేట్ బిర్యానీ ఇదే. చాలా మంది ఈ బిర్యానీని ఇష్టపడి మరీ తింటారు. సాధారణంగా చేసే బిర్యానీ కాకుండా.. హైదరాబాద్ స్టైల్‌లో చేసే బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. ఈ బిర్యానీ చేయడం కాస్త సమయం పట్టినా.. ఫైనల్‌గా రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇంత రుచిగా ఉండే ఆలూ దమ్ బిర్యానీని..

హైదరాబాద్ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీనే. కేవలం నాన్ వెజ్ బిర్యానీలే కాకుండా.. ఆలూ దమ్ బిర్యానీ కూడా ఫేమస్. వెజిటేరియన్ లవర్స్ ఫేవరేట్ బిర్యానీ ఇదే. చాలా మంది ఈ బిర్యానీని ఇష్టపడి మరీ తింటారు. సాధారణంగా చేసే బిర్యానీ కాకుండా.. హైదరాబాద్ స్టైల్‌లో చేసే బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. ఈ బిర్యానీ చేయడం కాస్త సమయం పట్టినా.. ఫైనల్‌గా రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇంత రుచిగా ఉండే ఆలూ దమ్ బిర్యానీని ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:
చిన్న ఆలు గడ్డలు, బాస్ మతి రైస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, పసుపు, ఉప్పు, బిర్యానీ దినుసులు, నెయ్యి, నూనె.
ఆలూ దమ్ బిర్యానీ తయారీ విధానం:
ముందుగా బంగాళ దుంపల్ని ఉడికించి పెట్టుకోవాలి. చిన్న బంగాళ దుంపలు ఉంటే పర్వాలేదు. పెద్ద దుంపల్ని అయితే కాస్త ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కడాయి తీసుకుని.. అందులో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆలు గడ్డలను వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీటిలోనే పచ్చి మిర్చి, పెరుగు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, బిర్యానీ మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి ఓ గంటసేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిజ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఓ అరగంట సేపు నానబెట్టిన బాస్ మతీ రైస్‌లో నీళ్లు, ఆయిల్, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. బిర్యానీ దినుసులు కూడా వేసి ఉడికించుకోవాలి.
ఈ రైస్ 70 శాతం ఉడికిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లార బెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టి.. కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన బంగాళ దుంపల్ని వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత నీళ్లు వేసి.. గ్రేవీలా ఉడికించుకోవాలి. ఇప్పుడు బాస్ మతీ రైస్ వేసి.. పైన కొద్దిగా నెయ్యి, కొత్తిమీర, వేయించుకున్న ఉల్లిపాయలను కూడా చల్లుకోవాలి. ఇక మూత పెట్టి.. చిన్న మంట మీదనే పావు గంట సేపు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. ఓ పది నిమిషాలు అలానే వదిలేసి సర్వ్ చేసుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే హైదరాబాదీ ఆలూ దమ్ బిర్యానీ సిద్ధం.




