Crispy Royyala Fry: క్రిస్పీ రొయ్యల వేపుడు.. ఇలా చేస్తే తినని వాళ్లు కూడా తినేస్తారు!
రొయ్యలు అంటే నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం. రొయ్యలతో వేపుడు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ చిట్టి రొయ్యలు అయితే ఇంకా అదిరిపోతాయి. రొయ్యల పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది. రొయ్యలు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి అప్పుడప్పుడూ అయినా తింటూ ఉండాలి. చాలా మంది రొయ్యలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వారికి ఒక్కసారి ఈ క్రిస్పీ రొయ్యల వేపుడు చేసి పెట్టండి. మళ్లీ చేయమని ఖచ్చితంగా..

రొయ్యలు అంటే నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం. రొయ్యలతో వేపుడు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ చిట్టి రొయ్యలు అయితే ఇంకా అదిరిపోతాయి. రొయ్యల పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది. రొయ్యలు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి అప్పుడప్పుడూ అయినా తింటూ ఉండాలి. చాలా మంది రొయ్యలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వారికి ఒక్కసారి ఈ క్రిస్పీ రొయ్యల వేపుడు చేసి పెట్టండి. మళ్లీ చేయమని ఖచ్చితంగా అడుగుతారు. అన్నీ సిద్ధంగా ఉండాలంటే కేవలం 15 నిమిషాల్లోనే ఈ రొయ్యల వేపుడు తయారు అవుతుంది. ఇంతకీ క్రిస్పీ రొయ్యల వేపుడు ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్రిస్పీ రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఆయిల్, సోయా సాస్, గుడ్లు, కార్న ఫ్లోర్, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి, టమాటా కెచప్.
క్రిస్పీ రొయ్యల వేపుడు తయారీ విధానం:
ఈ ఫ్రై చేసుకోవాలంటే ముందుగా రొయ్యాల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ వేపుడు చేసుకోవాలంటే రొయ్యలు కాస్త పెద్దవిగా ఉండలి చిన్న రొయ్యలు సరిగా రాదు. కాబట్టి పెద్ద రొయ్యలు దొరికితే తీసుకోండి. వీటిని పాన్‌లోకి తీసుకుని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి నీరంతా ఇగిరేంత వరకూ ఫ్రై చేసుకోవలి. ఇప్పుడు వీటిని చల్లార్చి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో సోయాసాస్, కోడి గుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి.
ఇందులో రొయ్యలను వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టి.. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో వెల్లలి తరుగు, సోయా సాస్, టమోటా కెచప్ వేసి వేయించాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా టాస్ చేయాలి. అంతే క్రిస్పీ రొయ్యల వేపుడు సిద్ధం. స్పైసీ కావాలి అనుకునేవారు మిరియాల పొడి వేసుకోవచ్చు.




