Dates For Health: రోజూ ఖర్జూరాలు తినడం వల్ల గుండెపోటు, క్యాన్సర్ వ్యాధులు జీవితంలో రావట!
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ఖర్జూరాలు చాలా ముఖ్యమైనవి. ఖర్జూరాల్లోని పోషకాలు మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఖర్జూరాలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..100 గ్రాముల ఖర్జూరంలో 7 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 15 శాతం పొటాషియం, 13 శాతం మెగ్నీషియం, 40 శాతం కాపర్ ఉంటాయి. వీటితోపాటు 13 శాతం మాంగనీస్, 5 శాతం ఐరన్, 15 శాతం విటమిన్ B-6 ఉంటాయి..
Updated on: Mar 07, 2024 | 7:39 PM

డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ఖర్జూరాలు చాలా ముఖ్యమైనవి. ఖర్జూరాల్లోని పోషకాలు మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఖర్జూరాలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

100 గ్రాముల ఖర్జూరంలో 7 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 15 శాతం పొటాషియం, 13 శాతం మెగ్నీషియం, 40 శాతం కాపర్ ఉంటాయి. వీటితోపాటు 13 శాతం మాంగనీస్, 5 శాతం ఐరన్, 15 శాతం విటమిన్ B-6 ఉంటాయి.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరంలోని ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. ఖర్జూరం జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. అజీర్తి సమస్యకు ఖర్జూరాలకు మించిన ప్రత్యామ్నయం మరొకటి లేదు.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు సైతం ఖర్జూరం మేలు చేస్తుంది. ఖర్జూరాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఖర్జూరం తప్పక తినాలి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఈ ప్రత్యేక యాంటీఆక్సిడెంట్ శరీరంలో దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేటరీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది క్యాన్సర్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

ఖర్జూరాల్లోని కెరోటినాయిడ్లు దృష్టిని మెరుగుపరచడంలో, మంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. గుండెపోటు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ఫినోలిక్ ఆమ్లాలు కూడా ఇందులో ఉన్నాయి.




