Almond Oil as Makeup Remover: ఈ నేచురల్ ఆయిల్‌తో మేకప్ సులువుగా తొలగించుకోవచ్చు.. నో సైడ్ ఎఫెక్ట్స్!
పండగ, ఫంక్షన్.. వేడుక ఏదైనా మగువలు అందంగా అలంకరించుకుని మురిసిపోతుంటారు. కొన్నిసార్లు మేకప్‌తో భారీ అలంకరణ ట్రే చేస్తుంటారు. అయితే వేడుక ముగిశాక మేకప్ తొలగించకపోతే చర్మ సమస్యలు పెరుగుతాయి. దీని వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మేకప్ చర్మ రంధ్రాలలో పేరుకుపోయి వైట్ హెడ్స్, మొటిమలు, చర్మ పగుళ్లు ఏర్పడతాయి. కాబట్టి మేకప్ తొలగించడం చాలా అవసరం. అయితే చాలా మందికి మేకప్ వేసుకునేటప్పుడు ఉన్నంత ఓపిక తొలగించుకునేటప్పుడు ఉండదు. ఓపికతో మేకప్ కూడా తొలగించాలని అంటున్నారు సౌందర్య నిపుణులు..
Updated on: Mar 07, 2024 | 7:44 PM

పండగ, ఫంక్షన్.. వేడుక ఏదైనా మగువలు అందంగా అలంకరించుకుని మురిసిపోతుంటారు. కొన్నిసార్లు మేకప్‌తో భారీ అలంకరణ ట్రే చేస్తుంటారు. అయితే వేడుక ముగిశాక మేకప్ తొలగించకపోతే చర్మ సమస్యలు పెరుగుతాయి. దీని వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మేకప్ చర్మ రంధ్రాలలో పేరుకుపోయి వైట్ హెడ్స్, మొటిమలు, చర్మ పగుళ్లు ఏర్పడతాయి. కాబట్టి మేకప్ తొలగించడం చాలా అవసరం.

అయితే చాలా మందికి మేకప్ వేసుకునేటప్పుడు ఉన్నంత ఓపిక తొలగించుకునేటప్పుడు ఉండదు. ఓపికతో మేకప్ కూడా తొలగించాలని అంటున్నారు సౌందర్య నిపుణులు. చాలామంది వ్యక్తులు మేకప్‌ను తొలగించడానికి మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. ఈ మేకప్ రిమూవర్‌లను ఉపయోగించడం వల్ల వీటిల్లోని రసాయనాలు చర్మానికి మరింత హాని తలపెడతాయి. మరైతే ఎలా అనుకుంటున్నారా? మేకప్ రిమూవర్‌కి బదులుగా సహజ పద్ధతుల్లో కూడా తొలగించుకోవచ్చు. అందుకు ఏం వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..

బాదం నూనె తెలియని వారుండరు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటర్‌ప్రూఫ్ మాస్కరా-ఐలైనర్ నుంచి పూర్తి కవరేజ్ ఫౌండేషన్ వరకు ప్రతిదీ క్లియర్ చేయడానికి బాదం నూనె బలేగా పనిచేస్తుంది. బాదం నూనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఈ నూనె మేకప్ తొలగించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

బాదం నూనెతో మేకప్‌ను తేలికగా తొలగించుకోవచ్చు. బాదం నూనె వాడటం వల్ల మేకప్ తొలగించిన తర్వాత చర్మం పొడిబారదు. బాదం నూనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

దీనిని ఎలా ఉపయోగించాలంటే.. ఒక చెంచా బాదం నూనె తీసుకుని.. అందులో 1/2 టీస్పూన్ తాజా అలోవెరా జెల్ కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి, తేలికగా చేతులతో మసాజ్ చేసుకోవాలి. తర్వాత తడి గుడ్డ లేదా తడి టిష్యూతో ముఖాన్ని తుడిచేసి, ఫేస్ వాష్‌తో ముఖం కడుక్కుంటే సరి. ఇది అన్ని రకాల మేకప్‌లను తొలగించడానికి ఉపయోగించవచ్చు.




