- Telugu News Photo Gallery Brighten up your home with this homemade liquid, check here is details in Telugu
Kitchen Hacks: ఈ హోమ్ మేడ్ లిక్విడ్‌తో మీ ఇంటిని మెరిపించండిలా..
ఇల్లు అద్దంలా మెరవాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. ఉన్నది చిన్న ఇల్లు అయినా అందంగా ఉంచేందుకు ఎన్నో పాట్లు పడతారు. ఇంటికి ఎన్నో మేకోవర్‌లు చేస్తూ ఉంటారు. అయితే రోజులు మారే కొద్దీ.. ఇల్లు అనేది పాత బడుతుంది. ఎంత శుభ్రం చేసినా.. మచ్చలు, మరకలు కనిపించడం కామన్. వాటిని వదిలించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. కానీ ఈసారి ఇలా చేయండి. అవి వెంటనే వదలడమే కాకుండా.. మీ ఇల్లు కూడా అద్దంలా..
Updated on: Mar 07, 2024 | 7:43 PM

ఇల్లు అద్దంలా మెరవాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. ఉన్నది చిన్న ఇల్లు అయినా అందంగా ఉంచేందుకు ఎన్నో పాట్లు పడతారు. ఇంటికి ఎన్నో మేకోవర్‌లు చేస్తూ ఉంటారు. అయితే రోజులు మారే కొద్దీ.. ఇల్లు అనేది పాత బడుతుంది. ఎంత శుభ్రం చేసినా.. మచ్చలు, మరకలు కనిపించడం కామన్.

వాటిని వదిలించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. కానీ ఈసారి ఇలా చేయండి. అవి వెంటనే వదలడమే కాకుండా.. మీ ఇల్లు కూడా అద్దంలా మెరిసిపోతుంది. అంతే కాదు మంచి సువాసన కూడా వస్తుంది.

ప్రతీ ఒక్కరి ఇంట్లోనూ నిమ్మ కాయ ఉంటుంది. నిమ్మకాయను కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా.. కిచెన్ హ్యాక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. నిమ్మ కాయలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ నిమ్మ కాయ లిక్విడ్‌తో మీ ఇంటిని మెరిపించుకోవచ్చు.

ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి. అందులో నిమ్మకాయని చిన్న తొక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే కొద్దిగా నిమ్మ రసాన్ని కూడా పిండండి. ఆ తర్వత అరకప్పు వెనిగర్ వేయండి. నెక్ట్స్ ఉప్పు, డిష్ వాషింగ్ లిక్విడ్, వాటర్ వేసి వాగా కలపండి.

ఇలా తయారైన లిక్విడ్‌తో మీరు ఇంటిని, గ్యాస్ కట్టు, కబోర్డ్స్, టీవీ ర్యాక్, కిటికీలు, టైల్స్, డైనింగ్ టేబుల్, కుర్చీలు.. ఇలా ఒక్కటేంటి.. ఎలాంటి వాటినైనాన శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. అంతే కాకుండా.. వాటి నుంచి మంచి సువాసన కూడా వస్తుంది.




