- Telugu News Photo Gallery These Yoga Asanas best to reduce mental anxiety, check here is details in Telugu
Yoga Asanas for Relaxation: ఈ యోగాసనాలు వేస్తే మానసిక ఆందోళన దూరం అవుతుంది..
యోగాసనాలు అనేవి ప్రాచీన కాలం నుంచి ఉన్నవి. యోగాతో ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా అదుపు చేయవచ్చు. ప్రతి రోజూ యోగాసనాలు వేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది. క్రమం తప్పకుండా కొన్ని యోగాసనాలు వేస్తే మానసిక ఆందోళన, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఈ సమస్య మరింత ఎక్కువై..
Updated on: Mar 07, 2024 | 6:14 PM

యోగాసనాలు అనేవి ప్రాచీన కాలం నుంచి ఉన్నవి. యోగాతో ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా అదుపు చేయవచ్చు. ప్రతి రోజూ యోగాసనాలు వేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది. క్రమం తప్పకుండా కొన్ని యోగాసనాలు వేస్తే మానసిక ఆందోళన, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఈ సమస్య మరింత ఎక్కువై.. చివరికి ఆత్మహత్యలకు దారి తీస్తుంది. ఈ యోగాసనాలను తరచూ వేస్తూ ఉంటే.. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

శవాసనం వేయడం వల్ల శరీరానికి, మనసస్సుకు పూర్తిగా రిలాక్సేషన్ దొరుకుతుంది. అంతే కాకుండా ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గుతాయి. మంచి నిద్ర పడుతుంది. రోజూ ఇలా ఉదయం లేదా రాత్రి వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ప్రతి రోజూ వృక్షసనం వేయడం వల్ల మానసిక సంతోషం కలుగుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దూరమవ్వడమే కాకుండా వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు. ప్రతి రోజూ పిల్లలతో ఈ ఆసనం వేయిస్తే.. వారిలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది.

అనులోమ - విలోమ ఆసనం. ప్రాణాయామ ఆసనంలో ఇది కూడా ఒకటి. ఇది వేయడం వల్ల శ్వాసను నియంత్రించుకోవచ్చు. అనులోమ - విలోమ ఆసనం వేయడం వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉండటమే కాకుండా.. ఒత్తిడి తగ్గుతుంది. రోజూ ఈ ఆసనం వేస్తే.. మానసిక ఒత్తిడి దరిచేరదు.




