అరే... నా బయోపిక్కా? ఎందుకు తీయడం? అంత ఫూలిష్ పని ఇంకోటుంటుందా? అని అంటున్నారు జీనత్ అమన్. తన గురించి బయోపిక్ తీయడానికి నిదానంగా కొందరు నచ్చజెప్పడం తాను గమనిస్తూనే ఉన్నానని అంటున్నారు జీనత్. అంతే కాదు, అది జరగాలంటే సెన్సిటివ్ డైరక్టర్, బ్రేవ్ రైటర్, అద్భుతమైన నటీనటులు కావాలని అన్నారు. నన్ను కలుపుకోకుండా నా బయోపిక్ తీయడమంటే ఫూలిష్‌నెస్సే. నా గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదుగా... అని అంటున్నారు గ్రేట్ లేడీ. తన జీవితం ప్రతి ఒక్కరికీ ఆసక్తిగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదని అంటున్నారు జీనత్.