- Telugu News Photo Gallery Cinema photos Heroine Mrunal Thakur following veteran actor sobhan babu with her investment in real estate Telugu Actress Photos
Mrunal Thakur: ఆదాయాన్ని డబుల్ చెయ్యడంలో శోభన్ బాబును ఫాలో అవుతున్న మృణాల్ ఠాకూర్
డబ్బులు సంపాదించడం కాదు.. వచ్చిన సొమ్మును ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా తెలిసుండాలి. ఈ విషయంలో మృణాళ్ ఠాకూర్ అందరికంటే రెండాకులు ఎక్కువే చదివింది. తనకు వచ్చిన డబ్బులను రెట్టింపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ముంబైలో బిజినెస్ షురూ చేసారు మృణాళ్. మరి ఆమె ఏం చేస్తున్నారు..? ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌కు బాగా చేరువైపోయారు మృణాళ్ ఠాకూర్.
Updated on: Mar 07, 2024 | 7:41 PM

డబ్బులు సంపాదించడం కాదు.. వచ్చిన సొమ్మును ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా తెలిసుండాలి. ఈ విషయంలో మృణాళ్ ఠాకూర్ అందరికంటే రెండాకులు ఎక్కువే చదివింది.

తనకు వచ్చిన డబ్బులను రెట్టింపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ముంబైలో బిజినెస్ షురూ చేసారు మృణాళ్. మరి ఆమె ఏం చేస్తున్నారు..?

ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌కు బాగా చేరువైపోయారు మృణాళ్ ఠాకూర్. సీతా రామంతో ఈ భామకు వచ్చిన క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఇక మొన్నొచ్చిన హాయ్ నాన్న కూడా మంచి విజయం సాధించింది.

దాంతో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది మృణాళ్ ఠాకూర్. తెలుగులో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్‌లో నటిస్తున్నారు. అవకాశాలు పెరిగినపుడు ఆదాయం కూడా పెరుగుతుంది కదా.!

ఆ పెరిగిన ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు మృణాళ్. అంతేకాదు.. ముంబైలో 2 అపార్ట్‌మెంట్స్ కూడా కొనేసారు ఈ భామ. ఈ రెండూ మరో హీరోయిన్ కంగనా రనౌత్ ప్రాపర్టీస్ అని తెలుస్తుంది.

అంధేరిలో దాదాపు 11 కోట్లతో ఖరీదైన ఫ్లాట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ముంబైలోనే కాదు.. హైదరాబాద్‌లోనూ ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నారు ఈ బ్యూటీ. ఎందుకంటే బాలీవుడ్ కంటే ఎక్కువగా సౌత్‌లోనే మృణాళ్‌కు వరస అవకాశాలు వస్తున్నాయి.

తమిళంలో ఇప్పటికే 2 సినిమాలకు సైన్ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులోనూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి వచ్చిన డబ్బును భూమిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు మృణాళ్.




