- Telugu News Photo Gallery Cinema photos Shah Rukh Khan Reacts On Allu Arjun Son Allu Ayaan Song Telugu Heroes Photos
Allu Ayaan: టాలీవుడ్ లో కొత్త హీరో.! మరోసారి ట్రేండింగ్ లో అల్లు వారసుడు.
మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు అల్లువారి చిన్నారి అయాన్. తన ముద్దు ముద్దు మాటలతో అయాన్ పాడిన పాటకు ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖానే ఫిదా అయ్యారు. అంతేకాదు తన పిల్లల గురించి కూడా ఇంట్రస్టింగ్ విషయాన్ని షేర్ చేశారు బాద్‌షా. ఇంతకీ అయాన్ ఏ పాట పాడాడు..? దానికి షారూక్ ఎలా రియాక్ట్ అయ్యారు? హావ్ ఏ లుక్. షారూఖ్ రీసెంట్ మూవీ డంకీ నుంచి లుట్ పుట్ గయా పాటను హమ్ చేశాడు అల్లు అయాన్.
Updated on: Mar 07, 2024 | 7:42 PM

మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు అల్లువారి చిన్నారి అయాన్. తన ముద్దు ముద్దు మాటలతో అయాన్ పాడిన పాటకు ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖానే ఫిదా అయ్యారు.

అంతేకాదు తన పిల్లల గురించి కూడా ఇంట్రస్టింగ్ విషయాన్ని షేర్ చేశారు బాద్‌షా. ఇంతకీ అయాన్ ఏ పాట పాడాడు..? దానికి షారూక్ ఎలా రియాక్ట్ అయ్యారు? హావ్ ఏ లుక్.

షారూఖ్ రీసెంట్ మూవీ డంకీ నుంచి లుట్ పుట్ గయా పాటను హమ్ చేశాడు అల్లు అయాన్. ట్రావెల్ టైమ్‌లో ఆటవిడుపుగా అయాన్ పాడిన ఈ పాటను స్వయంగా షారూక్‌కే రీ ట్వీట్ చేయటంతో ఆ వీడియో ఇప్పుడు నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

అయాన్ పాటను షేర్ చేయటమే కాదు. తన పిల్లలు కూడా పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను ప్రాక్టీస్ చేసేందుకు రెడీ అవుతున్నారంటూ ట్వీట్ చేశారు షారూక్.

ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. షారూఖ్ మెసేజ్‌పై స్పందించిన అల్లు అర్జున్, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

అల వైకుంఠపురంలో టైమ్‌లోనూ అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు అల్లు అయాన్. ఈ సినిమాలో ఓ మై గాడ్ డాడీ పాట ప్రమోషన్ వర్షన్‌లో చెల్లెలు అర్హతో కలిసి కనిపించారు.

మేకింగ్ వీడియోలోనూ అయాన్ అల్లరి అప్పట్లో బాగానే వైరల్ అయ్యింది. అయాన్ పాటతోనే కాదు మరో విషయంలో సోషల్ మీడియాలో బాద్ షా పేరు ట్రెండ్ అవుతోంది.

కింగ్ ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ మూవీ కబీ హా కబీ నా రిలీజ్ అయి 30 ఇయర్స్ అవుతుంది. దీంతో ట్విటర్‌లో హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.




