- Telugu News Photo Gallery Cinema photos Ananya Nagalla says about her first crush and her future husband qualities telugu movie news
Ananya Nagalla: కాబోయేవాడు ఇండస్ట్రీ వాడైతే కష్టం.. ఫస్ట్ క్రష్ అతడే.. హీరోయిన్ అనన్య నాగళ్ల..
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తెలుగమ్మాయిలలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. వకీల్ సాబ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ అర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా తంత్ర. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటిస్తుండగా.. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ భయపెట్టిస్తున్నారు.
Updated on: Mar 07, 2024 | 8:30 PM

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తెలుగమ్మాయిలలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. వకీల్ సాబ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ అర్టిస్ట్‌గా నటించి మెప్పించింది.

ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా తంత్ర. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటిస్తుండగా.. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ భయపెట్టిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తంత్ర మూవీ మార్చ్ 15న అడియన్స్ ముందుకు రానుంది.

ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న అనన్య.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ గురించి.. పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరో అంటే క్రష్ అంటూ మనసులోని మాటలు బయటపెట్టింది. అలాగే ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకోనని కూడా చెప్పేసింది.

తనకు కాబోయేవాడు నిజాయితీగా ఉంటే చాలని.. ఇప్పుడు తాను సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నానని తెలిపింది. ఇండస్ట్రీ వాళ్లయితే కొంచెం కష్టమని.. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావొచ్చని.. సినిమా వాళ్లకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయని.. ఇండస్ట్రీలో తన ఫస్ట్ క్రష్ హీరో నాగశౌర్య అని చెప్పుకొచ్చింది.

అలాగే చిన్నప్పుడు అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ అంటే చాలా ఇష్టమని.. వాళ్లందరి సినిమాలు చూస్తూ పెరిగానని తెలిపింది. తనకు ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదని.. ఇండస్ట్రీ వాళ్లను చూస్తే కమిట్ అయి ఉంటారని అనుకుంటారని.. కానీ ఇప్పటికీ తను మాత్రం కమిటేడ్ కాదని చెప్పుకొచ్చింది.

అలాగే తనకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదని చెప్పుకొచ్చింది అనన్య. ప్రస్తుతం అనన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం సినిమాలో అనన్య కీలకపాత్రలో నటించింది. ఆ తర్వాత ఆమె నటిస్తున్న సినిమా తంత్ర.




