- Telugu News Photo Gallery Cinema photos Sreeleela Rejects the star heros movie for this reason telugu movie news
Sreeleela: ఆ క్రేజీ ఆఫర్స్‌కు నో చెప్పిన శ్రీలీల.. రీజన్ మాత్రం అదిరిపోయిందిగా..
తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసిన శ్రీలీల.. 'మీ కలలను ప్రేమించండి.. ఎందుకంటే మీ కలలను మరెవరు నెరవేర్చలేరు..' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చేపేరు శ్రీలీల. ఒకే ఏడాది అరడజనుకు పైగా సినిమాలను ప్రకటించి సెస్సెషన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Mar 08, 2024 | 1:10 PM

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చేపేరు శ్రీలీల. ఒకే ఏడాది అరడజనుకు పైగా సినిమాలను ప్రకటించి సెస్సెషన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి సందడి అంటూ వచ్చేసి ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.

ధమాకా సినిమాలో మాస్ మహారాజా రవితేజతో ఈ భామ వేసిన మాస్ స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయ్యారు. శ్రీలీల డాన్స్ టాలెంట్ చూసి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇక్కడే అసలు పొరపాటు జరిగింది. శ్రీలీల అంటే కేవలం ఎనర్జిటిక్ డాన్స్ మాత్రమే అన్న పేరు మూటగట్టుకుంది ఈ బ్యూటీ.

దీంతో ఇప్పుడు వరుసగా డిజాస్టర్స్ అందుకుంటుంది. ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలలో కనిపించి ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది. కానీ ఈ పొరపాటును ఆదిలోనే గుర్తించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో అచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కేవలం డాన్స్, గ్లామర్ రోల్స్ కాకుండా ఈసారి కంటెంట్ ప్రాధాన్యత చూసి నటనకు ఆస్కారం ఉన్న రోల్స్ అయితేనే చేసేందుకు సిద్ధమయ్యిందట. అదే కారణంతో ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోస్ చిత్రాలను రిజెక్ట్ చేసిందని టాక్ విపిస్తుంది. కానీ ఈ విషయంపై క్లారిటీ మాత్రం లేదు.

అయితే శ్రీలీల నిర్ణయంపై పలువురు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కెరీర్.. స్టార్ డమ్ నిలదొక్కుకోవాల్సిన సమయంలో ఇలాంటి నిర్ణయం సరికాదని అంటున్నారు. ఇక కొందరు మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు.. కంటెంట్ ఉన్న సినిమాలు ఎంపిక చేసుకోవాలంటూ సూచిస్తున్నారు.

తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసిన శ్రీలీల.. 'మీ కలలను ప్రేమించండి.. ఎందుకంటే మీ కలలను మరెవరు నెరవేర్చలేరు..' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో నటిస్తుంది.




