Corn Cheese Bolls: క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్.. ఈవెనింగ్‌కి అదిరిపోయే స్నాక్..

స్నాక్స్‌లో ఇప్పుడు ఎన్నో వెరైటీలు వచ్చాయి. మొక్క జొన్నతో చేసేవి మరింత రుచిగా ఉంటున్నాయి. మీ కోసం స్పెషల్‌గా క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కొద్దిగా ప్రాసెస్ ఉన్నా.. తింటూ ఉంటే ఆ శ్రమ అంతా మర్చిపోతారు. అంత రుచిగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు మీకు ఫ్యాన్స్ అయిపోతారు..

Corn Cheese Bolls: క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్.. ఈవెనింగ్‌కి అదిరిపోయే స్నాక్..
Crispy Corn Cheese Balls
Follow us
Chinni Enni

|

Updated on: Jan 02, 2025 | 7:13 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది స్నాక్స్ తినేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్నాక్స్‌లో ఇప్పుడు ఎన్నో వెరైటీలు వచ్చాయి. మొక్క జొన్నతో చేసేవి మరింత రుచిగా ఉంటున్నాయి. మీ కోసం స్పెషల్‌గా క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కొద్దిగా ప్రాసెస్ ఉన్నా.. తింటూ ఉంటే ఆ శ్రమ అంతా మర్చిపోతారు. అంత రుచిగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు మీకు ఫ్యాన్స్ అయిపోతారు. పెద్దలకు కూడా బాగా నచ్చుతాయి. మళ్లీ మళ్లీ చేయమని అడుగుతూ ఉంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మరి క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్‌కి కావాల్సిన పదార్థాలు:

స్వీట్ కార్న్, మొజరెల్లా చీజ్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కార్న్ ఫ్లర్ లేదా కార్న్ స్టార్చ్, కార్న్ ఫ్లేక్స్, ఆయిల్.

క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ తయారీ విధానం:

ముందుగా స్వీట్ కార్న్‌ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. వీటిని ఓ గిన్నెలోకి తీసుకుకోవాలి. ఇప్పుడు కార్న్ ఫ్లేక్స్ తప్పించి.. మిగిలిన మొజరెల్లా చీజ్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కార్న్ ఫ్లర్ లేదా కార్న్ స్టార్చ్ అన్నీ గిన్నెలోకి వేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న బాల్స్‌లాగా చేసుకోవాలి. పైన క్రిస్పీ లేయర్ కావాలి అనుకుంటే మైదా పిండిలో కొద్దిగా నీళ్లు వేసి మిక్స్ చేసి.. అందు ఈ ఉండల్ని ముంచండి. ఆ తర్వాత కార్న్ ఫ్లేక్స్‌ని కూడా పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో బాల్స్‌ని రౌండ్ చేస్తే.. మరింత క్రిస్పీగా అవుతాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఈ బాల్స్ అందులో వేసి అన్ని వైపులా మిక్స్ చేసుకోవాలి. బాగా వేగాక ఓ ప్లేట్ లోకి తీసుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ సిద్ధం. వీటిని టమాటా కిచెప్ లేదా మయోనీస్‌, పుదీనా చట్నీతో తిన్నా సూపర్‌గా ఉంటాయి. మరింకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.