Drumstick For Diabetes: డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు మునగ తినొచ్చా? నిపుణులు ఏం చెబుతన్నారంటే..
మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని కూరగాయలు, పండ్లకు దూరంగా ఉండాలి. అయితే ఏది తినాలి.. ఏది తినకూడదు అనే విషయం వారికి క్లారిటీ ఉండదు. నిజానికి సరైన ఆహార నియమాలు అనుసరిస్తే డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగ ఉత్తమమైన ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్‌కు మునగ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలనుకుంటే ఆహారంలో..

మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని కూరగాయలు, పండ్లకు దూరంగా ఉండాలి. అయితే ఏది తినాలి.. ఏది తినకూడదు అనే విషయం వారికి క్లారిటీ ఉండదు. నిజానికి సరైన ఆహార నియమాలు అనుసరిస్తే డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగ ఉత్తమమైన ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్‌కు మునగ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలనుకుంటే ఆహారంలో మునగ తప్పనిసరిగా చేర్చుకోవాలి.
మునగ ఇన్ఫ్లమేటరీ వ్యాధులు, చర్మ సమస్యలను నివారిస్తుంది. ఇది సహజ రక్త శుద్ధిగా పనిచేస్తుంది. రక్తం నుంచి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. మునగలో బి-కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ ఎ, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలగా ఉంటాయి. ఇది చర్మ కాంతివంతంగా చేసి, జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. చికెన్‌పాక్స్ వంటి వ్యాధులను నివారించడానికి మునగ ఉపయోగపడుతుంది.
అధిక రక్తపోటు ఉన్నవారికి మునగ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారించవచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దీన్ని తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఐరన్, మెటల్ కంటెంట్ ఉంటుంది. మునగలోని వివిధ విటమిన్లు, ఖనిజాలు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు మునగ ఎక్కువగా తీసుకోవడం మంచిది. మునగలో ఉండే మరో ముఖ్యమైన పోషకం పీచు. ఇది జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. మునగలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు తెల్పుతున్నాయి. ఎందుకంటే ఇందులో ఇన్సులిన్ లాంటి ప్రొటీన్లు ఉంటాయి. క్యారెట్ కంటే మునగలో కొవ్వులో కరిగే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పాలు, అరటిపండ్ల కంటే ఎక్కువ లోహ మూలకాలు ఇందులో ఉంటాయి. అలాగే పాలకూరలో కంటే ఎక్కువ ఐరన్, నారింజలో కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మునగలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్తపోటు స్థాయిలను తగ్గించే సామర్థ్యం దీనికి ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరిచే లక్షణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








