AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Care: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ టీలు సూపర్‌.. అవేంటంటే..?

Heart Care: చాలా మంది టీ తాగడానికి ఇష్టపడతారు. ఇందులో ఉండే కెఫిన్ వల్ల ఈ పానీయం ఆరోగ్యానికి మంచిది

Heart Care: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ టీలు సూపర్‌.. అవేంటంటే..?
Heart Care
uppula Raju
|

Updated on: Jan 31, 2022 | 2:27 PM

Share

Heart Care: చాలా మంది టీ తాగడానికి ఇష్టపడతారు. ఇందులో ఉండే కెఫిన్ వల్ల ఈ పానీయం ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తారు. కానీ సరైన పరిమాణంలో తీసుకుంటే టీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని కప్పుల టీలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. క్యాన్సర్, గుండె జబ్బులను నిరోధించవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ రకమైన టీలను ఎంచుకోవాలో తెలుసుకుందాం.

1. బ్లాక్ టీ

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూ 2-3 కప్పుల బ్లాక్ టీ తాగేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తక్కువగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. వారి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా మెరుగుపడతాయి. అయినప్పటికీ అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులు ఉన్నవారికి ఇది మంచిదికాదు.

2. గ్రీన్ టీ

గుండె నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 3-4 కప్పుల గ్రీన్ టీని షుగర్‌ లేకుండా తీసుకోవాలి. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

3. వైట్‌ టీ

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వైట్ టీ గుండె ఆరోగ్యానికి మంచిది. వైట్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్లు ధమనులను విస్తరించడంలో సహాయపడతాయి. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

4. ఊలాంగ్ టీ

ఊలాంగ్ టీని కామెల్లియా సినెన్సిస్ మొక్క ఆకుల నుంచి తయారుచేస్తారు. కొరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్నవారికి ఇది మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ రోజువారీ ఆహారంలో ఊలాంగ్ టీని చేర్చే ముందు కార్డియాలజిస్ట్‌ను ఒక్కసారి సంప్రదిస్తే మంచిది.

Viral Photos: 2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు..?

దేశంలోని ప్రసిద్ధ సూర్య దేవాలయాలు ఇవే.. వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

SBI Offer: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే ద్విచక్ర వాహన రుణం..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు