SBI Offer: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే ద్విచక్ర వాహన రుణం..

SBI Offer: మీరు టూ వీలర్ లోన్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నట్లయితే ఎస్బీఐ మీకు బంపర్‌ ఆఫర్‌ని ప్రకటించింది. వాస్తవానికి స్టేట్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం ఈ స్పెషల్ ఆఫర్‌ను

SBI Offer: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే ద్విచక్ర వాహన రుణం..
Sbi
Follow us
uppula Raju

|

Updated on: Jan 30, 2022 | 1:20 PM

SBI Offer: మీరు టూ వీలర్ లోన్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నట్లయితే ఎస్బీఐ మీకు బంపర్‌ ఆఫర్‌ని ప్రకటించింది. వాస్తవానికి స్టేట్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం ఈ స్పెషల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద కస్టమర్లు మొదటగా రూ.10 వేల 251 వరకు EMI చెల్లించాలి. అంటే ఒక లక్ష రూపాయల బైక్ కోసం కస్టమర్లు నెలకు రూ.2510 EMI చెల్లించాలి. దీంతో పాటు బ్యాంకు రుణాలపై మరిన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి.

ఈ ఆఫర్ ఫీచర్లు ఏంటి..?

ఈ ఆఫర్ కింద రూ.20,000 నుంచి రూ.3 లక్షల వరకు బ్యాంకు రుణం అందిస్తోంది. ఈ లోన్ గరిష్టంగా 48 నెలల కాలానికి అందిస్తుంది. రుణంపై వడ్డీ రేట్లు 9.35 శాతం నుంచి ప్రారంభమవుతుంది. వాహనం ఆన్-రోడ్ ధరలో గరిష్టంగా 85 శాతం వరకు బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఇది కస్టమర్ ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తారు. YONO యాప్ ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. రుణం కోసం ఖాతాదారుడు బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేదు. షరతులను నెరవేర్చిన కస్టమర్ రుణం వెంటనే ఆమోదిస్తారు. నేరుగా మొత్తం డీలర్ ఖాతాలోకి విడుదల చేస్తారు. బ్యాంక్ ప్రత్యేక ఆఫర్ కింద మార్చి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపు ఉంటుంది.

ఎవరికి రుణ సౌకర్యం లభిస్తుంది..

బ్యాంక్ ఈ ఆఫర్ ప్రీ-అప్రూవ్డ్ కేటగిరీలో ఉంది. అంటే బ్యాంకుతో కస్టమర్‌కు ఉన్న సంబంధాల ఆధారంగా ఈ ఆఫర్ వారికి అందిస్తారు. కస్టమర్ ఇంట్లో కూర్చొని తన ఇంటి నుంచి ఈ విషయాలు తెలుసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ప్రకారం ప్రస్తుతం ఈ ఆఫర్ కోసం బ్యాంక్ నిర్దిష్ట వర్గం కస్టమర్లను ఎంపిక చేసింది. ఈ లోన్ ఆఫర్ చేయబడిన కస్టమర్‌లు కొన్ని సులభమైన దశలతో ఇంట్లో కూర్చొని ఈ సదుపాయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం యోనో యాప్ సహాయం తీసుకోవాలి.

ఆఫర్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలి..?

ఈ ఆఫర్ గురించి బ్యాంక్ కస్టమర్లకు మెస్సేజ్‌ లేదా ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిస్తుంది. మీరు ఈ ఆఫర్‌ను స్వీకరించారా వద్దా అనేది బ్యాంకుకు వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్‌ను పొందినట్లయితే యోనో యాప్ సహాయంతో లోన్ మొత్తాన్ని పొందవచ్చు. ఇందుకోసం ముందుగా యోనో యాప్‌కు లాగిన్ అవ్వాలి. దీని తర్వాత మీరు యాప్‌లోని ఆఫర్ బ్యానర్‌పై దరఖాస్తుపై క్లిక్ చేయాలి. కొత్త పేజీలో మీరు మీ సమాచారాన్ని తెలియజేయాలి. తర్వాత మీరు డీలర్, వాహనం వివరాలను నింపాలి. వాహనం ఆన్-రోడ్ ధరను ఇవ్వాలి. బ్యాంక్ ఇచ్చిన సమాచారాన్ని చదివిన తర్వాత మీరు ఆఫర్‌ను అర్థం చేసుకుంటే నిబంధనలు, షరతులను అంగీకరించాలి. ఈ పూర్తి ప్రక్రియ తర్వాత మీరు బ్యాంక్ నుంచి డీల్ కోసం OTPని పొందుతారు. దాన్ని పూరించిన తర్వాత మీ లోన్ ఆమోదిస్తారు. డీలర్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.

Post Office: పోస్టాఫీసులో పెట్టుబడి మీ భవితకు రాబడి.. మెరుగైన వడ్డీ.. పన్ను ప్రయోజనం..

IND vs WI: వెస్టిండీస్‌ సిరీస్‌ కోసం స్టాండ్‌బైలో ఇద్దరు ఆటగాళ్లు.. ఎవరంటే..?

నిరుద్యోగులకు శుభవార్త.. CISFలో కానిస్టేబుల్ పోస్ట్‌లు.. అర్హత 12వ తరగతి.. ?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?