Post Office: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో పెట్టుబడి మీ భవితకు రాబడి.. మెరుగైన వడ్డీ.. పన్ను ప్రయోజనం..
Post Office: మీరు భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్సే వింగ్స్ స్కీమ్స్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు.
Post Office: మీరు భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని పొందుతారు. అంతేకాదు మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. బ్యాంక్ డిఫాల్ట్ అయితే మీరు రూ. 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో అలా కాదు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. అంతేకాదు పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ కూడా ఒకటి. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సంవత్సరానికి 5.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకంలో వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో నెలకు కనీసం రూ.100 లేదా రూ.10 కంటే ఎక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. పోస్ట్ ఆఫీస్ RD పథకంలో ఒక వయోజన వ్యక్తి, ఒక మైనర్ కలిసి ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా మైనర్ తరపున గార్డియన్ ఖాతాను తెరవవచ్చు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ కూడా ఈ పథకంలో ఖాతాను తెరవవచ్చు. ఇందులో ఎన్ని ఖాతాలైనా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ పోస్టాఫీసు పథకం ఖాతా తెరిచిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటుంది. (అంటే 60 నెలవారీ డిపాజిట్) సంబంధిత పోస్టాఫీసులో దరఖాస్తు చేయడం ద్వారా ఖాతాను మరో ఐదు సంవత్సరాల పాటు పొడగించుకునే అవకాశం ఉంటుంది. పొడిగించిన వ్యవధిలో వడ్డీ రేటు ఖాతా తెరిచిన వడ్డీ రేటునే అందిస్తారు. పూర్తి సంవత్సరాలకు RD వడ్డీ రేటు వర్తిస్తుంది. ఒక సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధిలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు వర్తిస్తుంది. RD ఖాతాను ఎటువంటి డిపాజిట్లు చేయకుండా మెచ్యూరిటీ తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటు పొడగించుకునే అవకాశం ఉంటుంది.