Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలోని ప్రసిద్ధ సూర్య దేవాలయాలు ఇవే.. వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Spiritual News: భారతదేశంలో ప్రాచీన సూర్య దేవాలయాలు చాలా ఉన్నాయి. అవి విశ్వాసానికి మాత్రమే కాకుండా గొప్పతనానికి కూడా ప్రసిద్ధి చెందాయి.

దేశంలోని ప్రసిద్ధ సూర్య దేవాలయాలు ఇవే.. వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
Sun Temple
Follow us
uppula Raju

|

Updated on: Jan 30, 2022 | 2:43 PM

Spiritual News: భారతదేశంలో ప్రాచీన సూర్య దేవాలయాలు చాలా ఉన్నాయి. అవి విశ్వాసానికి మాత్రమే కాకుండా గొప్పతనానికి కూడా ప్రసిద్ధి చెందాయి. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం నుంచి గుజరాత్‌లోని మోధేరాలోని సూర్య దేవాలయం వరకు చాలా గొప్ప ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. ఏ ఆలయానికి ఆ ఆలయం ఆధ్యాత్మిక రహస్యాలు ప్రత్యేకం. దేశంలోని ఐదు ప్రధాన సూర్య దేవాలయాల గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.

1. కోణార్క్ సూర్య దేవాలయం

సూర్యదేవుని ప్రసిద్ధ దేవాలయాలలో కోణార్క్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ఒడిశాలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం దేశంలోని 10 అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా చెబుతారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుని కుమారుడు సాంబ స్థాపించాడని నమ్ముతారు. అన్ని రకాల రహస్యాలను కలిగి ఉన్న ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరానికి దాదాపు 23 మైళ్ల దూరంలో చంద్రభాగ నది ఒడ్డున ఉంటుంది. రథానికి 12 చక్రాలు ఉండే విధంగా ఈ ఆలయం నిర్మించారు. ఈ చక్రాలు 12 నెలలకు చిహ్నంగా భావిస్తారు. ఈ దేవాలయంలోని విశిష్టమైన శిల్పం, దానికి సంబంధించిన కథలు ఈ ఆలయాన్ని ప్రత్యేకం చేస్తాయి. ఈ ఆలయంలో సూర్యోదయం మొదటి కిరణం ఆలయ ప్రధాన ద్వారంపైకి వస్తుంది.

2. ఔరంగాబాద్ దేవ్ సూర్య దేవాలయం

బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ప్రత్యేక మైన సూర్య దేవాలయం ఉంది. దీని దర్వాజ తూర్పుకు బదులుగా పడమర వైపు ఉంటుంది. ఈ దేవర్క్ సూర్య దేవాలయం త్రేతాయుగానికి చెందినదిగా చెబుతారు. ఇక్కడ ఏడు రథాలపై ప్రయాణించే సూర్యదేవుని మూడు రూపాలు కనిపిస్తాయి. ఇందులో ఉదయాచల- అంటే ఉదయించడం, మధ్యాచల- అంటే మధ్యాహ్న, అస్తాచలం- అంటే అస్తమించే సూర్యుడు కనిపిస్తాడు.

3. మోధేరా సూర్య దేవాలయం

మోధేరా సూర్య దేవాలయం గుజరాత్‌లోని పటాన్‌కు దక్షిణాన 30 కిలోమీటర్ల దూరంలో మోధేరా గ్రామంలో ఉంటుంది. ఈ సూర్య దేవాలయం ప్రత్యేకమైన వాస్తుశిల్పం, హస్తకళకు ప్రసిద్ధి. దీనిని 1026 ADలో సోలంకి రాజవంశానికి చెందిన రాజు భీమ్‌దేవ్ I నిర్మించారు. మొధేరా సూర్య దేవాలయం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం గర్భగుడి, రెండవది సభామండపం. సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోకి వచ్చే విధంగా ఆలయాన్ని నిర్మించారు.

4. కశ్మీర్ మార్తాండ్ ఆలయం

కశ్మీర్‌లో ఉన్న మార్తాండ్ ఆలయం దేశంలోని ప్రసిద్ధ సూర్య దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం కశ్మీర్‌లోని దక్షిణ భాగంలో అనంత్‌నాగ్ నుంచి పహల్గామ్ వెళ్లే మార్గంలో మార్తాండ్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఈ సూర్య దేవాలయాన్ని 8 శతాబ్దంలో కర్కోట రాజవంశానికి చెందిన రాజు లలితాదిత్య నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయంలో ఒక పెద్ద సరస్సు కూడా ఉంటుంది.

5. ఆంధ్ర ప్రదేశ్ సూర్యనారాయణ దేవాలయం

ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా అర్సవల్లి గ్రామానికి తూర్పున 1 కి.మీ దూరంలో సుమారు 1300 సంవత్సరాల నాటి సూర్య భగవానుడి దేవాలయం ఉంది. ఇక్కడ సూర్య నారాయణుడు అతని భార్యలు ఉష, ఛాయతో కలిసి పూజించబడతాడు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సంవత్సరంలో రెండుసార్లు, సూర్యుని మొదటి కిరణాలు నేరుగా విగ్రహంపై పడతాయి. ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహం కశ్యప్ రుషిచే స్థాపించబడిందని నమ్ముతారు. ఈ ఆలయంలో సూర్యదేవుని దర్శనం సంతోషాన్ని, అదృష్టాన్ని కలిగిస్తుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

SBI Offer: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే ద్విచక్ర వాహన రుణం..

Post Office: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో పెట్టుబడి మీ భవితకు రాబడి.. మెరుగైన వడ్డీ.. పన్ను ప్రయోజనం..

Wrinkles: 30 ఏళ్లు దాటితే ముఖంపై ముడతలు.. రక్షణ కోసం ఈ చర్యలు..?