బచ్చలికూరలో అద్భుత పోషకాలు.. ఎముకల ధృడత్వానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి సూపర్..

Spinach: శీతాకాలంలో ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో బచ్చలికూర చెప్పుకోతగినది. ఇందులో పోషకాలు

బచ్చలికూరలో అద్భుత పోషకాలు.. ఎముకల ధృడత్వానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి   సూపర్..
Spinach
Follow us

|

Updated on: Jan 31, 2022 | 2:49 PM

Spinach: శీతాకాలంలో ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో బచ్చలికూర చెప్పుకోతగినది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాలానుగుణంగా వచ్చే ఆకుకూరలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. బచ్చలికూరలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎముకలని దృఢంగా చేస్తాయి. ఇది ఒక రకమైన సూపర్‌ఫుడ్ అని చెప్పవచ్చు. మీరు బచ్చలికూరతో అనేక రకాల వంటకాలు చేయవచ్చు.

బచ్చలికూర లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. బచ్చలికూర ఎముకలలో కొల్లాజెన్ నిర్మాణాలను రక్షించే మంచి కూరగాయల ప్రోటీన్ కలిగి ఉంటుంది. కండరాలు, ఎముకలను బాగా బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బచ్చలికూర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ ఎ అధిక మోతాదులో ఇన్ఫెక్షన్, వాపును నివారించడంలో సహాయపడుతుంది. శ్వాస, మూత్ర, పేగు శ్లేష్మ పొరలను బలపరుస్తుంది. విటమిన్ ఎ అనేది మానవ శరీరంలో వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే లింఫోసైట్స్ ప్రధాన భాగం.

గర్భిణీలు బచ్చలి ఆకుకూరలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోలిక్ యాసిడ్ కంటెంట్ కారణంగా ఇది వైకల్యాలున్న పిల్లల జనన రేటును తగ్గిస్తుంది. పొట్ట, జీర్ణక్రియకు ఆరోగ్యకరమైన పోషకాలలో బచ్చలికూర ఒకటి. బచ్చలికూర లో చాలా పోషకాలు ఉంటాయి. డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు పనితీరును నియంత్రిస్తుంది. బచ్చలికూర లోని ఫోలేట్ కడుపు, DNA కణాలను రక్షిస్తుంది. పెద్ద పేగు కణాలలో ప్రాణాంతక ఉత్పరివర్తనలు ఏర్పడకుండా కాపాడుతుంది. బచ్చలికూర ఆరోగ్యకరమైన మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా వృద్ధ రోగులలో నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడే హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది.

దేశంలోని ప్రసిద్ధ సూర్య దేవాలయాలు ఇవే.. వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Viral Photos: 2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు..?

SBI Offer: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే ద్విచక్ర వాహన రుణం..