Health Tips: తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందా? అయితే ఈ ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకోండి..

కరోనా (corona) ఎంటరయ్యాక మన జీవనశైలి (Life Style) పూర్తిగా మారిపోయింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల భద్రతను దృష్టిల ఉంచుకుని వర్క్ ఫ్రం హోం (Work from home) అమలు చేస్తున్నాయి. దీని వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.

Health Tips: తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందా? అయితే ఈ ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకోండి..
Follow us
Basha Shek

|

Updated on: Jan 31, 2022 | 10:32 AM

కరోనా (corona) ఎంటరయ్యాక మన జీవనశైలి (Life Style) పూర్తిగా మారిపోయింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల భద్రతను దృష్టిల ఉంచుకుని వర్క్ ఫ్రం హోం (Work from home) అమలు చేస్తున్నాయి. దీని వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పరంగా చాలా సమస్యలు వస్తున్నాయి. శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.  అందులో థైరాయిడ్, మధుమేహం, బీపీ, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఇంటి నుంచి పనిచేసే వారిలో చాలామంది జీర్ణ సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా తిన్న తర్వాత కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారు. దీని వల్ల పనిపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

యాపిల్

యాపిల్ లో  విటమిన్లు,  ఖనిజాలతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే  ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడంలో ఫైబర్  ఎంతో కీలకం. అందుకే  రోజులో కనీసం ఒక యాపిలైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నేరుగా పండ్లను తీసుకోలేని వారు యాపిల్ జ్యూస్ తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.  యాపిల్ ను తరచుగా తీసుకోవడం వల్ల ముఖంలో మెరుపు కూడా సంతరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

పెరుగు

కడుపు ఉబ్బరం, మలబద్ధకం తదితర జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే పెరుగు మంచి ఆహారం.  ఇందులో ఉండే బ్యాక్టీరియా జీవక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రుచిగా ఉండడం వల్ల పెద్దలతో పాటు పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తీసుకుంటారు. అయితే  చలికాలంలో మధ్యాహ్నం పూట  పెరుగు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

బీట్ రూట్

ఇందులో  ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తిన్న ఆహార పదార్థాలను తేలికగా జీర్ణం చేయడంలో సహకరిస్తాయి. అదేవిధంగా బీట్‌రూట్  పలు రకాల వ్యాధులను దూరం చేస్తుంది. మీరు దీన్ని ఆహారంలో చేర్చుకోవాలనుకుంటే,  సలాడ్ రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

ఓట్స్

ఓట్స్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఇది తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్తను పటిష్ఠం చేస్తుంది. ఎసిడిటీ, అజీర్తి లాంటి సమస్యలు దరిచేరకుండా రక్షణనిస్తుంది. ఓట్స్ తో పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే అందుతో తయారుచేసిన గంజిని తీసుకోవాలంటున్నారు నిపుణులు. రుచి కోసం అందులోకి  క్యారెట్, ఇతర ఆకు కూరలను కూడా కలుపుకోవచ్చని సూచిస్తున్నారు.

Also Read:Viral video: జాతి వైరం మరిచిపోయిన శునకం, పిల్లి.. విక్రమార్కుడు, బేతాళుడిని గుర్తుచేశారంటోన్న నెటిజన్లు..