AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Festival: సౌదీ అరేబియాలో తొలిసారిగా యోగా ఫెస్టివల్.. ఇందులో ప్రత్యేకత ఏంటంటే?

Yoga Festival: భారత్‌లో పుట్టిన యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం పలు దేశాల్లోని ప్రజలు యోగా పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా(Saudi Arabia)లో..

Yoga Festival: సౌదీ అరేబియాలో తొలిసారిగా యోగా ఫెస్టివల్.. ఇందులో ప్రత్యేకత ఏంటంటే?
Representative Image
Janardhan Veluru
|

Updated on: Jan 31, 2022 | 11:19 AM

Share

Yoga Festival: భారత్‌లో పుట్టిన యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం పలు దేశాల్లోని ప్రజలు యోగా పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా(Saudi Arabia)లో తొలిసారిగా యోగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. బే లా సన్ బీచ్‌లో శనివారం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రవాస భారతీయులు(NRIs) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు(Yogasanas) వేశారు.  ఫిబ్రవరి 1 తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ యోగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.  దేశంలో యోగాను ప్రోత్సహించేందుకు సౌదీ యోగా కమిటీ తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని తమ దేశంలో నిర్వహిస్తోంది. యోగా ఫెస్టివల్‌కు తాము ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన లభిస్తోందని నిర్వాహకులు సంతోషం వ్యక్తంచేశారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో సౌదీ అరేబియా దేశ నలుమూలల నుంచి పలువురు పాల్గొని తమ యోగాసనాలతో చూపరులను అలరించారు. యోగా నిపుణులు తమ శిష్యుల చేత యోగాసనాలను ప్రదర్శింపజేశారు. చిన్నారులు, యువతీయువకులు, మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. గత 20 ఏళ్లుగా సౌదీ అరేబియాలో యోగాకు ప్రాముఖ్యత పెరుగుతున్నట్లు సౌదీ యోగా కమిటీ చీఫ్ నౌఫ్ బింత్ ముహమ్మద్ అల్-మరోయి ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

జిమ్స్‌లో యోగా శిక్షణకు ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వడంతో చాలా మంది నిపుణులు ఇందులో శిక్షణ కల్పిస్తున్నారు. సౌదీ క్రీడా మంత్రిత్వ శాఖ కూడా తమ దేశంలో యోగాని ప్రోత్సహిస్తుండటం విశేషం. భారత్‌కు చెందిన యోగా టీచర్ ఇరుమ్ ఖాన్ కూడా ఈ యోగా ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు. సౌదీ అరేబియాలో 2008 నుంచి ఆమె యోగాసనాలపై శిక్షణ కల్పిస్తున్నారు. జెడ్డా‌కు చెందిన ప్రముఖ యోగా నిపుణులు దనా అల్గోసైబి, లెబనాన్‌కు చెందిన నటాలీ క్రీడెహ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యోగా ఫెస్టివల్‌లో యోగాసనాలు వేస్తున్న చిన్నారి..

సౌదీ అరేబియాలో యోగా ఫెస్టివల్ దృశ్యాలు

మరిన్ని ప్రవాస భారతీయ సంబంధిత వార్తలను ఇక్కడ చదవండి.. 

Also Read..

Omicron: ఒమిక్రాన్ అత్యంత వేగంగా ఎందుకు వ్యాప్తి చెందుతుందో తెలుసా? స్టడీలో షాకింగ్ విషయాలు..

Nani: మరో ప్రయోగం చేయబోతున్న హీరో నాని.. సింగరేణి బొగ్గు గని కార్మికుడి జీవిత కథలో న్యాచురల్ స్టార్..