Govt Policy: పిల్లల్ని కనండి.. బహుమతులు, రాయితీలు పొందండి.. ఆఫర్లు మామూలుగా లేవండోయ్..!

Govt Policy: ప్రపంచ దేశాలకే ఛాలెంజ్ విసురుతున్న చైనా.. ఒక్క విషయంలో మాత్రం తెగ భయపడిపోతోంది.

Govt Policy: పిల్లల్ని కనండి.. బహుమతులు, రాయితీలు పొందండి.. ఆఫర్లు మామూలుగా లేవండోయ్..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 30, 2022 | 4:24 PM

Govt Policy: ప్రపంచ దేశాలకే ఛాలెంజ్ విసురుతున్న చైనా.. ఒక్క విషయంలో మాత్రం తెగ భయపడిపోతోంది. అది కూడా ఆ దేశానికి సంబంధించిన అంతర్గత సమస్యతోనే సతమతం అవుతోంది. ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు ముప్పు తిప్పలు పడుతోంది. ఇంతకీ చైనాను అంతలా వేధిస్తున్న ఆ సమస్య ఏంటి? అగ్రరాజ్యానికే జంకని చైనా.. ఏ విషయానికి అంతలా భయపడుతోంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనా.. తగ్గుతున్న జనాభా కారణంగా సమస్యలను ఎదుర్కొంటోంది. దాంతో ఆ దేశంలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఇప్పుడు జనాభాను పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. పాత చైల్డ్ పాలసీని తొలగించి కొత్త చైల్డ్ పాలసీని తీసుకువచ్చింది. అయినప్పటికీ.. పెద్దగా మార్పు అయితే కనిపించడం లేదని ప్రభుత్వం ఆందోళన చెందుతోందట. ఈ విషయాన్ని ప్రపంచ మీడియాతో పాటు.. చైనా మీడియా కూడా చెబుతోంది. ఈ జనాభా సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు.. చైనా ప్రభుత్వం సరికొత్త పథకాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు, బహుమతులు ప్రకటిస్తోంది. పెళ్లి చేసుకోండి.. ఎంతమంది అంటే అంతమంది పిల్లల్ని కనండి అంటూ ఎంకరేజ్ చేస్తోంది చైనా సర్కార్. ఈ ప్రోత్సాహకం వెనుక అసలు కారణం.. దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభేనట.

టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో ప్రచురించిన బ్లాగ్‌లో, CPFA (సెంటర్ ఫర్ పొలిటికల్ అండ్ ఫారిన్ అఫైర్స్) ప్రెసిడెంట్ ఫాబియన్ బౌసార్ట్ మాట్లాడుతూ.. ‘‘చైనా బేబీ బోనస్‌లు, ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు, పన్ను తగ్గింపులు, పిల్లల పెంపకం రాయితీలను ప్రోత్సాహకాలుగా అందిస్తోంది. చైనా అధికారులు వివిధ సంస్థల ద్వారా ముగ్గురు పిల్లలను కలిగి ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. బీజింగ్ డబినాంగ్ టెక్నాలజీ గ్రూప్ తన ఉద్యోగులకు 90,000 యువాన్ల వరకు నగదు ప్రోత్సాహకం, 12 నెలల ప్రసూతి సెలవులు, 9 రోజుల ప్రత్యేక సెలవులను అందిస్తోంది. ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీలు కూడా అనేక ఆఫర్లను ప్రకటించాయి.’’ అని చెప్పారు.

గర్భిణీ స్త్రీలు, పిండంలోని బిడ్డలు సురక్షితంగా ఉండేందుకు ప్రత్యేక సబ్సిడీలు.. గర్భిణీ స్త్రీలు, పిండంలోని బిడ్డలు సురక్షితంగా ఉండేందుకు కంపెనీ నిర్వాహకులకు సబ్సిడీ ఇస్తున్నారని వరల్డ్ మీడియా పేర్కొంది. ఆగస్టులో నూతన జనాభా, కుటుంబ నియంత్రణ చట్టం ఆమోదించబడినప్పటి నుంచి చైనాలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాలు, ప్రాంతాలు ప్రసవానికి సంబంధించిన నియమాలను సవరించాయి (చైనా జనాభా నియంత్రణ విధానం). చైనా అధికారిక వార్తా వెబ్‌సైట్ జిన్హువా ప్రకారం.. బీజింగ్, సిచువాన్, జియాంగ్జితో సహా అనేక ప్రాంతాలు ఈ విషయంలో అనేక సహాయక చర్యలను ప్రకటించాయి. వీటిలో పితృత్వ సెలవు, ప్రసూతి సెలవుల పొడిగింపు, వివాహానికి సెలవు, పితృత్వ సెలవుల పొడిగింపు వంటి నిర్ణయాలు ఉన్నాయి.

ఐదవ సంవత్సరం కూడా తగ్గుదల.. చైనా జనాభా వరుసగా ఐదో సంవత్సరం కూడా తగ్గింది. గత సంవత్సరం చివరి నాటికి చైనా జనాభా 1.4126 బిలియన్లు, ఇది అర మిలియన్ కంటే తక్కువ (చైనా జనాభా జనన రేటు) పెరిగింది. జననాల రేటు వరుసగా ఐదవ సంవత్సరం కూడా జనాభా క్షీణతను నమోదు చేసింది. ఈ గణాంకాలు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన చైనాకు పొంచి ఉన్న జనాభాపరమైన ముప్పు, అది విసిరే ఆర్థిక ముప్పుగా విశ్లేషిస్తున్నారు నిపుణులు. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (NBS) ప్రకారం.. చైనాలో జనాభా 2020లో 1.4120 బిలియన్ల నుండి 2021 చివరి నాటికి 1.4126 బిలియన్లకు పెరిగింది. చైనా జనాభా 2020లో 10.6 మిలియన్లతో పోలిస్తే ఒక సంవత్సరంలో 480,000 మాత్రమే పెరిగింది.

చైనాలో పెరుగుతున్న వృద్ధుల జనాభా.. చైనాలో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది. దీని వల్ల యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వృద్ధ జనాభా పెరగడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపడమే అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది దేశం యొక్క ఆర్థిక పురోగతిని కూడా నిరోధిస్తుంది. ఒక దేశం వృద్ధి చెందాలంటే.. పనిచేసే మానవ వనరులు చాలా కీలకం. ఇలాంటి సమయంలో యువత కంటే, వృద్ధుల సంఖ్య పెరగడం అంటే ఆ దేశం ఆర్థికంగా నష్టపోవడం ఖాయం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి పింఛన్లు, ఆరోగ్య సదుపాయాలు వంటి అన్ని అలవెన్సులు తీసుకుంటున్న వృద్ధుల జనాభా పెరుగడం వల్ల ప్రభుత్వంపై భారమే పడుతుంది తప్ప.. ప్రయోజనం శూన్యం అవుతుంది. సరళంగా చెప్పాలంటే, చైనా జనాభా వృద్ధాప్యం అవుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ లేదా దేశ అభివృద్ధికి పని చేయదు. అందుకే యువత పెళ్లి చేసుకోవాలని, ఎక్కువ పిల్లలను కనాలని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

Also read:

Mouth Ulcers: నోటి పూతతో ఇబ్బందులు పడుతున్నారా..? ఈ చిట్కాలు పాటిస్తే తక్షణ ఉపశమనం..

Hyderabad: భాగ్యనగరంలో కొత్త తరహా మోసం.. ఇలా చేస్తారని మీరు ఊహించలేరు

IOCL Recruitment 2022: 626 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ.. పూర్తివివరాలివే..