AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Snow Strom: అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్..ఆఫీసులకు, స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..

Snow Strom In US: మంచు తుఫాన్ అగ్రరాజ్యం అమెరికా(America)లో బీభత్సం సృష్టిస్తోంది. నార్త్‌ ఈస్ట్‌, మిడ్‌ అట్లాంటిక​, న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా భారీగా మంచు పేరుకుంది. భారీగా మంచు(Snow)

US Snow Strom: అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్..ఆఫీసులకు, స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..
Snow Storm In Us
Surya Kala
|

Updated on: Jan 30, 2022 | 10:58 AM

Share

Snow Strom In US: మంచు తుఫాన్ అగ్రరాజ్యం అమెరికా(America)లో బీభత్సం సృష్టిస్తోంది. నార్త్‌ ఈస్ట్‌, మిడ్‌ అట్లాంటిక​, న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా భారీగా మంచు పేరుకుంది. భారీగా మంచు(Snow) కురుస్తుండడంతో.. అనేక ఊర్లు, ప్రాంతాలు, రోడ్లు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. రహదారులపైనా మంచు భారీగా కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. రెండు అడుగుల మేర మంచు పేరుకు పోవడంతో రోడ్లన్ని ప్రమాదకరంగా మారాయి. దీంతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో అమెరికా ప్రభుత్వం చర్యలను చేపట్టింది. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంచు తుఫాన్ ధాటికి ప్రభుత్వ కార్యాలయాలను, విద్యాసంస్థలను మూసివేస్తున్నామని ప్రకటించింది.

కరొలినాస్‌, అప్పలాంచియా ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి శీతలగాలుల తీవ్రంగా వీస్తున్నాయి. చలి గాలులు భారీగా వీస్తున్న నేపధ్యంలో స్థానిక అధికారులు స్నో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. బహిరంగ పార్కింగ్‌లను నిషేధించారు. మరోవైపు మంచు తుఫాన్ కారణంగా పలు విమాన సర్వీసులను విమానయాన సంస్థలు రద్దు చేశాయి. దీంతో సుమారు 4వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి.

మరోవైపు హిమపాతం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రోజంతా మంచు కురుస్తుండటంతో పలు ప్రాంతాలలో 30 సెంటీమీటర్లకు పైగా మంచు పేరుకుపోయింది. మాన్ హాటన్‌కు సమీపంలోని లాంగ్ ఐలాండ్‌లో 25 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని అనేక రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. జనవరి ప్రారంభంలో వర్జీనియాలో వచ్చిన మంచు తుఫాను సమయంలో జరిగిన వందలాది రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టింది.

Also Read:

Fish Pickle: ఆంధ్రా స్టైల్ లో అద్భుతమైన రుచితో చేపల నిల్వ పచ్చడిని తయారు చేసుకోండి ఇలా..