Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg News: రోజు ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తింటున్నారా..! తాజా అధ్యయనంలో సంచలన నిజాలు..

Egg News: గుడ్డు అనేది సంపూర్ణ ఆహారం. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్‌ ఎ,సి, డి, ఇంకా ప్రొటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. గుడ్డు

Egg News: రోజు ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తింటున్నారా..! తాజా అధ్యయనంలో సంచలన నిజాలు..
Egg
Follow us
uppula Raju

|

Updated on: Dec 29, 2021 | 1:09 PM

Egg News: గుడ్డు అనేది సంపూర్ణ ఆహారం. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్‌ ఎ,సి, డి, ఇంకా ప్రొటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. గుడ్డు అందరు ఇష్టపడే అల్పాహారం. గరిష్ట ప్రయోజనాల కోసం ప్రతిరోజూ కనీసం ఒకటి నుంచి రెండు గుడ్లు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తారు. కానీ ఒక అధ్యయనం ప్రకారం అధిక గుడ్డు వినియోగం మధుమేహాన్ని ప్రేరేపిస్తుందని తేలింది. ఈ పరిశోధన ప్రకారం రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు (50 గ్రాములకు సమానం) తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 60 శాతం పెరిగినట్లు తేలింది.

పురుషుల కంటే మహిళల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లు తేల్చారు. చైనా మెడికల్ యూనివర్శిటీ, ఖతార్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధన ప్రకారం.. చాలారోజులు రోజుకు రెండు కంటే ఎక్కువ గుడ్లు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం సుమారు 25 శాతం పెంచింది. అంతేకాకుండా క్రమం తప్పకుండా చాలా గుడ్లు తినే పెద్దలలో (50 గ్రాముల కంటే ఎక్కువ) మధుమేహం వచ్చే ప్రమాదం 60 శాతం పెరిగిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో 8,545 మంది చైనీస్ పెద్దలు (సగటు వయస్సు 50 సంవత్సరాలు) చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్లు పాల్గొన్నారు.

వాస్తవానికి గుడ్డులోని పసుపు భాగంలో విటమిన్ ఎ, డి, ఈ, కె, ఒమేగా-3 కొవ్వులు ఉంటాయి. ఫోలేట్, విటమిన్ B12 గుడ్డులోని తెల్ల భాగంతో పోలిస్తే పసుపు భాగంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే గుడ్డు పచ్చసొనలో ఐరన్, రైబోఫ్లావిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఏ డైట్ తీసుకోవాలనుకున్నా.. మీరు ఖచ్చితంగా ఒకసారి డైటీషియన్‌ సలహా తీసుకోవాలి. అలాగే క్యాలరీల విషయంలోనూ చాలామంది పచ్చసొనను తినడానికి ఇష్టపడరు. గుడ్డులో దాదాపు 72 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 55 కేలరీలు పచ్చసొనవి కాగా.. తెలుపు భాగంలో 17 క్యాలరీలు ఉంటాయి. అందువల్ల, క్యాలరీల సంఖ్యను తగ్గించడంలో భాగంగా కొంతమంది పసుపు భాగాన్ని తినరు.

FSSAI Admit Card 2022: ఫుడ్ అనలిస్ట్ పోస్టుల అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

BP Control: మందులు వాడకుండానే బీపీని కంట్రోల్ చేయవచ్చు..! ఎలాగో తెలుసుకోండి..?

Omicron: అలర్ట్‌..! ఒమిక్రాన్‌కి సంబంధించి WHO 7 హెచ్చరికలు జారీ..?