FSSAI Admit Card 2022: ఫుడ్ అనలిస్ట్ పోస్టుల అడ్మిట్ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
FSSAI Admit Card 2022: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) 7వ ఫుడ్ అనలిస్ట్, 4వ జూనియర్ ఫుడ్ అనలిస్ట్
FSSAI Admit Card 2022: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) 7వ ఫుడ్ అనలిస్ట్, 4వ జూనియర్ ఫుడ్ అనలిస్ట్ పోస్టుల కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు FSSAI అధికారిక వెబ్‌సైట్ fssai.gov.in నుంచి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 17 నుంచి 20 వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష జరగాల్సి ఉంది. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు కింద ఇచ్చిన సూచనలను అనుసరించవచ్చు.
అభ్యర్థులు ముందుగా FSSAI అధికారిక వెబ్‌సైట్ fssai.gov.inని సందర్శించాలి. ఆపై హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ‘రిక్రూట్‌మెంట్’ విభాగానికి వెళ్లి తర్వాత అడ్మిట్ కార్డ్‌ని ఎంచుకోండి. లాగిన్ చేయడానికి వినియోగదారు ID, పాస్‌వర్డ్, భద్రతా కోడ్‌ను నమోదు చేయండి. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ కూడా తీసుకోండి.
నివేదికల ప్రకారం..171056 మంది అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్‌లో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టెక్నికల్ ఆఫీసర్, ఇతర పోస్ట్‌ల కోసం 233 ఖాళీలను భర్తీ చేయడం ఈ రిక్రూట్‌మెంట్ లక్ష్యం. FSSAI అడ్మిట్ కార్డ్ 2021ని డౌన్‌లోడ్ చేయడానికి ఈ మెయిల్ ఐడి లేదా యూజర్ ఐడి, పాస్‌వర్డ్, సెక్యూరిటీ కోడ్ అవసరం. రాత పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు.