AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BP Control: మందులు వాడకుండానే బీపీని కంట్రోల్ చేయవచ్చు..! ఎలాగో తెలుసుకోండి..?

BP Control: ఆధునిక జీవనశైలి, ఉద్యోగంలో ఒత్తిడులు, కుటుంబ పరిస్థితుల వల్ల చాలామంది అధిక బీపీకి గురవుతున్నారు. దీనిని కంట్రోల్‌

BP Control: మందులు వాడకుండానే బీపీని కంట్రోల్ చేయవచ్చు..! ఎలాగో తెలుసుకోండి..?
High Bp
Follow us
uppula Raju

|

Updated on: Dec 29, 2021 | 11:55 AM

BP Control: ఆధునిక జీవనశైలి, ఉద్యోగంలో ఒత్తిడులు, కుటుంబ పరిస్థితుల వల్ల చాలామంది అధిక బీపీకి గురవుతున్నారు. దీనిని కంట్రోల్‌ చేయడానికి విపరీతమైన మందులు వాడుతున్నారు. అయితే ఈ మందులు బీపీని కంట్రోల్‌ చేయడమేమో కానీ వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటున్నాయి. కుప్పలు కుప్పలుగా బీపీ టాబ్లెట్లు మింగడం ఆరోగ్యానికి మంచిది కాదు. సహజసిద్దంగా కూడా బీపీని కంట్రోల్‌ చేయవచ్చు. దీనికోసం డాక్టర్లు రకరకాల సలహాలు ఇస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

హైపర్‌ టెన్సన్‌ తగ్గించాలంటే ఉపవాసం చేయడం బెస్ట్‌ ఎంపిక అని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల బీపీ దానంతట అదే కంట్రోల్ అవుతుందని సూచించారు. బీపీ మందులు మానేసి ఇలా చేస్తే మంచి ఉపశమనం దొరుకుతుందన్నారు. రక్తపోటును తగ్గించడానికి ఉపవాసంతో పాటు మద్యం, మాంసం, ఉప్పు తగ్గించాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు తినాలి. పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారంపై ఆధారపడాలి. ఇలాచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఉపవాసం కూడా వైద్యుల పర్యవేక్షణలో జరగాలి.

అధిక రక్తపోటు ఉన్న వ్యక్తి కేవలం మొక్కల ఆధారిత ఆహారం తినడం వల్ల BP 7 పాయింట్లు తగ్గుతుందని డాక్టర్ నివేదించారు. మొక్కల ఆధారిత ఆహారం, తక్కువ మాంసాన్ని కలిపి తీసుకోవడం వల్ల రక్తపోటు 11 పాయింట్లు తగ్గుతుందని తెలిపారు. రోజూ మద్యపానం చేసేవారు ఆల్కహాల్‌ను మానేయ్యాలి. ఇలా చేస్తే హై బీపీలో 5 పాయింట్ల తగ్గుదలని చూడవచ్చు. 10 పౌండ్లు బరువు తగ్గితే సిస్టోలిక్ ఒత్తిడిలో 7 పాయింట్ల తగ్గుదలకు కారణమవుతుంది. కనీసం 3 నెలల పాటు క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల BP కొలతలో 9 పాయింట్లు తగ్గించవచ్చు. సోడియంను తగ్గించడం వల్ల BPని 15 పాయింట్ల వరకు తగ్గించవచ్చు. పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాలు ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే BP 18 పాయింట్లకు తగ్గించవచ్చు. ఉపవాసం చేసేటప్పుడు నీరు మాత్రమే తీసుకుంటే బీపీ 37 పాయింట్లకు తగ్గుతుంది. కానీ ఇది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.

Omicron: అలర్ట్‌..! ఒమిక్రాన్‌కి సంబంధించి WHO 7 హెచ్చరికలు జారీ..?

వామ్మో.. ఇక్కడ ఒక్కసారి తింటే లక్ష రూపాయల బిల్లు.. అంత స్పెషల్‌ ఏంటంటే..?

చలికాలంలో చర్మం దురదగా ఉంటుందా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..