AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఇక్కడ ఒక్కసారి తింటే లక్ష రూపాయల బిల్లు.. అంత స్పెషల్‌ ఏంటంటే..?

Most Expensive Restaurants: మీరు చాలా ఖరీదైన వస్తువుల గురించి విని ఉంటారు. ఖరీదైన వజ్రాలు, ఖరీదైన వాహనాల మాదిరి ఖరీదైన రెస్టారెంట్లు

వామ్మో.. ఇక్కడ ఒక్కసారి తింటే లక్ష రూపాయల బిల్లు.. అంత స్పెషల్‌ ఏంటంటే..?
Luxury
uppula Raju
|

Updated on: Dec 29, 2021 | 10:53 AM

Share

Most Expensive Restaurants: మీరు చాలా ఖరీదైన వస్తువుల గురించి విని ఉంటారు. ఖరీదైన వజ్రాలు, ఖరీదైన వాహనాల మాదిరి ఖరీదైన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇక్కడి ఆహారం చాలా ఖరీదు. ప్రపంచంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఆహారం తినడానికి కనీసం లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తిండికి లక్షల రూపాయలా.. అని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది నిజం. ఈ రెస్టారెంట్లలో ఆహారం తినడానికి వెళితే ఒక వ్యక్తి 2000 డాలర్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి రెస్టారెంట్ల గురించి తెలుసుకుందాం.

1. సబ్లిమోషన్, స్పెయిన్ రెస్టారెంట్‌ సబ్లిమేషన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్‌. ఇందులో భోజనం చేయడానికి దాదాపు $2380 ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ ఒక వ్యక్తి తన కడుపు నింపుకోవడానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ హోటల్‌లోని ప్రత్యేకత ఏమిటంటే ఇది కొన్ని నెలల పాటు అంటే వేసవిలో మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇది ఒక అక్వేరియంలో నిర్మించారు. దీని కారణంగా ఇక్కడ ధర ఎక్కువగా ఉంటుంది.

2. పెర్ సే, అమెరికా రెండో స్థానంలో న్యూయార్క్‌లోని హోటల్ పెర్ సే. ఇది 2014 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌ కొన్ని ప్రత్యేక రుచులకు ప్రసిద్ధి చెందింది. విశేషమేమిటంటే ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్‌లో చాలా ఆప్షన్‌లు ఉంటాయి. ఫ్రెంచ్, అమెరికన్ వంటకాలు ఇందులో లభిస్తాయి. ఇక్కడ ఆహారం తినడానికి ఒక వ్యక్తి $680 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

3. అల్ట్రావైలెట్‌, చైనా అల్ట్రావైలెట్ రెస్టారెంట్ ప్రపంచంలో మూడో అత్యంత ఖరీదైన రెస్టారెంట్‌. ఇది చైనాలో ఉంటుంది. ఈ హోటల్‌లో భోజనం చేయడానికి ఒక వ్యక్తికి $ 570 నుంచి $ 900 వరకు ఖర్చవుతుంది. అద్భుతమైన చెఫ్, వంటల కారణంగా ఈ హోటల్ ప్రత్యేకంగా పరిగణిస్తారు. ధనవంతులు ఇక్కడికి రావడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.

4. మాసా, న్యూయార్క్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో న్యూయార్క్‌లోని మాసా అనే రెస్టారెంట్ ఉంది. ఈ హోటల్‌లో భోజనం, పానీయాలు పన్నులతో సహా ఒక్కొక్కరికి $595 ఖర్చువుతుంది.

5. మైసన్ పిక్ వాలెన్స్ – పారిస్, ఫ్రాన్స్ ఈ జాబితాలో ఈ రెస్టారెంట్ ఐదో స్థానంలో ఉంటుంది. ఈ రెస్టారెంట్‌లోని బార్ ధర $445. ఈ హోటల్ ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంటుంది.

Omicron: అలర్ట్‌..! ఒమిక్రాన్‌కి సంబంధించి WHO 7 హెచ్చరికలు జారీ..?

చలికాలంలో చర్మం దురదగా ఉంటుందా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Teeth: దంతాలకు బ్రేస్ అమర్చితే జాగ్రత్త..! ఈ సమస్యలు ఉండే అవకాశం..

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC