AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: పర్యాటకుల ముందే కుక్కపై పంజా విసిరిన పులి.. భయంతో కేకలు పెట్టిన టూరిస్టులు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

సాధారణంగా పులి జంతువులను వేటాడడం మనం ఎక్కువగా టీవీల్లోనే చూసి ఉంటాం. ముఖ్యంగా డిస్కవరీ ఛానెల్‌లో జింకల్లాంటి జంతువులపై పులి ఎలా దాడి చేస్తుందో తరచూ చూపిస్తుంటారు

Viral video: పర్యాటకుల ముందే కుక్కపై పంజా విసిరిన పులి.. భయంతో కేకలు పెట్టిన టూరిస్టులు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..
Follow us
Basha Shek

|

Updated on: Dec 29, 2021 | 11:03 AM

సాధారణంగా పులి జంతువులను వేటాడడం మనం ఎక్కువగా టీవీల్లోనే చూసి ఉంటాం. ముఖ్యంగా డిస్కవరీ ఛానెల్‌లో జింకల్లాంటి జంతువులపై పులి ఎలా దాడి చేస్తుందో తరచూ చూపిస్తుంటారు. ఇలా పులి పంజాను టీవీల్లో చూడడమే కానీ నేరుగా చూడడం చాలా అరుదు. అంత ధైర్యం కూడా ఎవరికీ ఉండదు. అయితే రాజస్థాన్‌లోని ఓ పార్క్‌కు వెళ్లిన పర్యాటకులకు పులి పంజా ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలిసొచ్చింది. తమ ముందే ఓ కుక్కపై దాడికి పాల్పడిన పులిని చూసి వారు భయంతో వణికి పోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్కు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. రోజూ వేలాదిమంది పర్యాటకులు ఈ పార్కుకు వస్తుంటారు. ఎప్పటిలాగే కొంతమంది టూరిస్టులు రెండు సఫారి వాహనాల్లో పార్క్‌ సందర్శనకు బయలుదేరారు. అయితే వారిని ఓ వీధి కుక్క అనుసరించింది. కాగా సఫారీ వాహనాల ముందు తచ్చాడుతూ తిరుగుతున్న కుక్కపై ఉన్నట్టుండి పంజా విసురుతుంది పులి. ఒక్క ఊదుటున దాడి చేసి దానిని పొదల మాటుకు తీసుకెళ్లి చంపేస్తుంది. దీంతో అక్కడ ఉన్న టూరిస్టులంతా భయంతో కేకలు వేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అనీష్ అంధేరియా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘పులి కుక్కపై దాడి చేసి చంపడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల కుక్కల ద్వారా డిస్టెంపర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పులులకు సంక్రమించే ప్రమాదం ఉంది. దీంతో పులుల జనాభా తగ్గిపోయే అవకాశం ఉంది. వన్యప్రాణుల మనుగడకు ఈ కుక్కలు ముప్పుగా మారాయి. అభయారణ్యాల్లో కుక్కలను నియంత్రించాల్సిన అవసరముంది’ అని అనీష్‌ రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Also Read:

Viral Video: భోజనం చేస్తున్నప్పుడు మాస్క్‌ ఎందుకు పెట్టుకోలేదని వృద్ధుడిని చితక బాదిన మహిళ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

David Warner: చాలా రోజుల తర్వాత వార్నర్‌ గురించి ట్వీట్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..

Treadmill Walk: ట్రెడ్‌మిల్‌ మీద12 గంటలు.. 66 కిలోమీటర్ల నడక.. మొరాదాబాద్‌ ఎక్స్‌ ప్రెస్‌ మరో అరుదైన ఘనత..