AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Treadmill Walk: ట్రెడ్‌మిల్‌ మీద12 గంటలు.. 66 కిలోమీటర్ల నడక.. మొరాదాబాద్‌ ఎక్స్‌ ప్రెస్‌ మరో అరుదైన ఘనత..

చక్కని శరీరాకృతి సొంతం చేసుకువాలని, ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలని చాలామంది జిమ్‌కు వెళ్లి వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తుంటారు. అదేవిధంగా అక్కడి ట్రెడ్‌మిల్‌, డంబెల్స్, సైక్లింగ్‌ పరికరాలతో గంటల కొద్దీ వ్యాయామం చేసి స్లిమ్‌గా మారేందుకు ప్రయత్నిస్తుంటారు.

Treadmill Walk: ట్రెడ్‌మిల్‌ మీద12 గంటలు.. 66 కిలోమీటర్ల నడక.. మొరాదాబాద్‌ ఎక్స్‌ ప్రెస్‌ మరో అరుదైన ఘనత..
Basha Shek
|

Updated on: Dec 29, 2021 | 9:05 AM

Share

చక్కని శరీరాకృతి సొంతం చేసుకువాలని, ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలని చాలామంది జిమ్‌కు వెళ్లి వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తుంటారు. అదేవిధంగా అక్కడి ట్రెడ్‌మిల్‌, డంబెల్స్, సైక్లింగ్‌ పరికరాలతో గంటల కొద్దీ వ్యాయామం చేసి స్లిమ్‌గా మారేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన జైనూల్‌ అబేదిన్‌ అనే యువకుడికి కూడా జిమ్‌ అంటే చాలా ఇష్టం. గంటల కొద్దీ జిమ్‌లో గడపడమేకాకుండా వాకింగ్‌, రన్నింగ్‌లు చేసి పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందుకే స్థానిక ప్రజలు జైనూల్‌ను ‘మొరాదాబాద్‌ ఎక్స్‌ ప్రెస్‌’ అని ముద్దుగా పిలుస్తుంటారు. తాజాగా అతను మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ట్రెడ్‌మిల్‌పై ఏకంగా 12 గంటల పాటు 66 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించాడు.

కాగా అబేదిన్‌ ట్రెడ్‌మిల్‌ విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూడడానికి వివిధ జిల్లాల నుంచి అధికారులు, సామాన్యులు పెద్ద ఎత్తున మొరాదాబాద్‌కు తరలివచ్చారు. అతను ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నంత సేపు ఉత్సాహపరిచారు. ఈక్రమంలో రికార్డు పూర్తవ్వగానే అందరూ పూలవర్షం కురిపించి అభినందనలు తెలిపారు. ‘ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఈ ట్రెడ్‌మిల్ పోటీని నిర్వహించాను. ఈ గుర్తింపుతో గిన్నిస్‌ రికార్డుల్లో నాకు చోటు దక్కుతుందని ఆశిస్తున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు జైనూల్‌. కాగా గతంలో పలు రేస్‌ ఈవెంట్లలో పాల్గొన్నాడు అబేదిన్‌. ఢిల్లీలోని ఇండియా గేట్‌ నుంచి ఆగ్రా, జైపూర్‌ వరకు ప్రయాణించి మరలా దేశ రాజధానిని చేరుకున్నాడు. కేవలం 7 రోజుల 22 గంటల్లో ఈ రేస్‌ను పూర్తి చేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఇక కరోనా మహమ్మారి సమయంలో పోలీసుల సేవలకు గౌరవ సూచకంగా 50 కిలోమీటర్లు నడక సాగించాడు.

Also read:

Chennai: రేపటి నుంచి చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌.. ప్రదర్శితం కానున్న 60 దేశాల సినిమాలు..

Alia bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీకి అరుదైన గౌరవం.. మూగజీవాలపై ప్రేమకు గుర్తుగా..

Irfan Pathan: రెండోసారి తండ్రైన టీమిండియా మాజీ క్రికెటర్‌.. ముద్దుల కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..