David Warner: చాలా రోజుల తర్వాత వార్నర్‌ గురించి ట్వీట్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..

పేలవమైన ఫామ్‌లో ఉన్నాడని ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం. ఆ తర్వాత యూఏఈ వేదికగా జరిగిన రెండో ఎడిషన్‌ పోటీల్లో జట్టులో స్థానం కూడా కల్పించలేదు.

David Warner: చాలా రోజుల తర్వాత వార్నర్‌ గురించి ట్వీట్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 29, 2021 | 9:36 AM

పేలవమైన ఫామ్‌లో ఉన్నాడని ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం. ఆ తర్వాత యూఏఈ వేదికగా జరిగిన రెండో ఎడిషన్‌ పోటీల్లో జట్టులో స్థానం కూడా కల్పించలేదు. దీంతో వార్నర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ల మధ్య బంధం ముగిసిపోయినట్టేనని చాలామంది క్రికెట్‌ అభిమానులు భావించారు. అందుకు తగ్గట్లే ఇటీవల జరిగిన రిటైన్‌ ప్రక్రియలో డేవిడ్‌ను వదిలేసింది సన్‌రైజర్స్‌ యాజమాన్యం. ఆ తర్వాత వార్నర్‌ కూడా తాను మెగావేలంలో పాల్గొంటున్నట్లు ప్రకటించాడు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ హెడ్‌ కోచ్‌కు ఆసీస్‌కే చెందిన టామ్‌ మూడీ మళ్లీ నియమితులయ్యారు. ఈక్రమంలో 2022 ఐపీఎల్‌ మెగా వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకోవాలని ఓ అభిమాని ఆయనకు సోషల్ మీడియాలో మెసేజ్‌ పెట్టాడు. ‘తప్పకుండా .. ట్రై చేస్తాం’ అని టామ్‌ దీనికి సమాధానమిచ్చాడు. కాగా దీనిని ట్యాగ్‌ చేస్తూ ‘ఇది అతిపెద్ద అనుమానం’ అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టాడు.

దీనిపై స్పందించిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీ ‘యాషెస్‌ సిరీస్‌లో విజయం సాధించినందుకు కంగ్రాట్స్‌ డేవిడ్‌.. చూస్తుంటే నువ్వు మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లున్నావు. సక్సెస్‌ పార్టీని బాగా ఎంజాయ్‌ చేవు. రాబోయే ఐపీఎల్‌ మెగా వేలంలోనూ నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం’ అని సన్‌ రైజర్స్‌ పోస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ వార్నర్‌ గురించి ట్వీట్‌ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో వేలంలో డేవిడ్‌ను హైదరాబాద్‌ మళ్లీ తీసుకుంటుందేమోనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే వార్నర్‌ను కొనుగోలు చేయడానికి ఇతర ఫ్రాంఛైజీలు కూడా పోటీపడుతున్నాయి. కాగా ఐపీఎల్‌ తర్వాత యూఏఈలో జరిగిన టీ 20 వరల్డ్‌ కప్‌లో ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచి తన జట్టుకు పొట్టి ప్రపంచకప్‌ను అందించాడీ డ్యాషింగ్‌ బ్యాటర్‌. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న యాషెస్‌ సిరీస్‌లోనూ అదరగొడుతున్నాడు.

Also Read:

Treadmill Walk: ట్రెడ్‌మిల్‌ మీద12 గంటలు.. 66 కిలోమీటర్ల నడక.. మొరాదాబాద్‌ ఎక్స్‌ ప్రెస్‌ మరో అరుదైన ఘనత..

Chennai: రేపటి నుంచి చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌.. ప్రదర్శితం కానున్న 60 దేశాల సినిమాలు..

Alia bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీకి అరుదైన గౌరవం.. మూగజీవాలపై ప్రేమకు గుర్తుగా..