Shami: విధ్వంసం సృష్టిస్తున్న ఫాస్ట్ బౌలర్లు.. బాక్సింగ్ డే టెస్టుల్లో చెలరేగిన బోలాండ్, స్టార్క్, షమీ, ఎంగిడి..

బాక్సింగ్ డే నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో పేస్ బౌలర్లు విధ్వంసం సృష్టించారు. ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఒకటి మూడో రోజునే ముగిసింది...

Shami: విధ్వంసం సృష్టిస్తున్న ఫాస్ట్ బౌలర్లు.. బాక్సింగ్ డే టెస్టుల్లో చెలరేగిన బోలాండ్, స్టార్క్, షమీ, ఎంగిడి..
Shami
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 29, 2021 | 9:28 AM

బాక్సింగ్ డే నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో పేస్ బౌలర్లు విధ్వంసం సృష్టించారు. ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఒకటి మూడో రోజునే ముగిసింది. మరో మ్యాచ్ భవితవ్యం నేడు తేలే అవకాశం ఉంది. 26న సెంచూరియన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ ప్రారంభం కాగా, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ కూడా అదే రోజు ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ మంగళవారం ముగిసింది. రెండు మ్యాచ్‌ల్లో ఫాస్ట్ బౌలర్లే ఆధిపత్యం చేలయించారు. రెండు టెస్ట్‎ల్లో మంగళవారం మొత్తం 24 వికెట్లు పడ్డాయి. మూడో రోజు మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ప్రస్తుతం టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 3-0తో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్‌ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఆలౌటైంది.

బోలాండ్, స్టార్క్ 

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున స్కాట్ బోలాండ్ అరంగేట్రం చేశాడు. జట్టును గెలిపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఈ బౌలర్ ఆరుగురు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను అవుట్ చేశాడు. ఆశ్చర్యకరంగా ఇన్ని వికెట్లు తీయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. కేవలం నాలుగు ఓవర్లు బౌల్ చేసి ఇంగ్లాండ్ జట్టులో సగానికిపైగా పెవిలియన్ బాట పట్టాడు. అతను నాలుగు ఓవర్లలో ఒక మెయిడిన్ ఓవర్ వేసి ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బోలాండ్ తన బౌలింగ్‌లో కొన్ని గొప్ప డెలివరీలు వేశాడు. అతను తెలివైన బంతులతో జానీ బెయిర్‌స్టో, జో రూట్‌ల అవుట్ చేశాడు. అతనికి ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మద్దతుగా నిలిచాడు. స్టార్క్ 10 ఓవర్లలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

ఎంగిడి

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో రోజు ఆట రద్దయింది. మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఆపై భారత బ్యాట్స్‌మెన్లపై లుంగీ ఎంగిడి ఆధిపత్యం చేలయించాడు. అయితే అతడి కంటే ముందు కగిసో రబాడ కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఎంగిడి 24 ఓవర్లలో 71 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు.

మహ్మద్ షమీ

దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‎లో 197 పరుగులకు ఆలౌటైంది. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా వెన్ను విరిచాడు. షమీ 16 ఓవర్లలో 44 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు.

Read Also.. Wasim Jaffer vs Michael Vaughan: వసీం జాఫర్, మైకేల్ వాన్ మధ్య ట్విట్టర్ యుద్ధం.. వీడియో వైరల్..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.