IND vs SA: కోహ్లీ భయ్యా.. నువ్వెక్కడున్నా కింగే.. మైదానంలో మళ్లీ స్టెప్పులేసిన టీమిండియా కెప్టెన్.. నెట్టింట్లో వైరల్ వీడియో..
తన ఆటతీరుతోనే కాదు ప్రవర్తనతోనూ ఎంతోమంది అభిమానుల మనసు గెల్చుకున్నాడు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ముఖ్యంగా మైదానంలో సహచరులను ఎంతో ప్రోత్సహిస్తుంటాడు
తన ఆటతీరుతోనే కాదు ప్రవర్తనతోనూ ఎంతోమంది అభిమానుల మనసు గెల్చుకున్నాడు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ముఖ్యంగా మైదానంలో సహచరులను ఎంతో ప్రోత్సహిస్తుంటాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తోటి ఆటగాళ్లలో జోష్ నింపేందుకు తనదైన ప్రయత్నం చేస్తుంటాడు. మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలోనే డ్యాన్స్‌లు చేస్తూ గ్యాలరీల్లోని ప్రేక్షకులను అలరిస్తుంటాడు. గతంలో వీటికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ మళ్లీ స్టెప్పులేశాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో బౌలర్లను ఉత్సాహపరుస్తూ కాలు కదిపాడు. ఒక అభిమాని దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేయగా..అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
కాగా దక్షిణాఫ్రికాతో తొలిటెస్టులో కే ఎల్ రాహుల్ శతకం బాదిన సంగతి తెలిసిందే. అయితే రెండో రోజూ పూర్తి ఆట వర్షా్ర్పణమైంది. ఇక మూడో రోజైతే రాహుల్ అందించిన ఆరంభాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రొటీస్ బౌలర్ల ధాటికి కొద్దిసేపైనా క్రీజులో నిలవలేకుండా పెవిలియన్ చేరారు. దీంతో అభిమానులు ఎంతో నిరుత్సాహపడ్డారు. అయితే మొదటి ఇన్సింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస విరామాల్లో వికెట్లు నేలకూల్చారు. ఆతిథ్య జట్టును 197 పరుగులకే పరిమితం చేశారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ మధ్యలో బౌలర్లను ఉత్సాహపరుస్తూ మైదానంలోనే డ్యాన్స్ వేశాడు కెప్టెన్ కోహ్లీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘కోహ్లీ భయ్యా.. నువ్వెక్కడున్నా కింగే..’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Virat Kohli dancing to the tune. India is having a great day on field ❤???…
~Virat and his dance steps are pure bliss to watch ?❤️@imVkohli pic.twitter.com/ZocAuhYw3y
— Lavanya Jessy (@LavanyaJessy) December 28, 2021
Also Read:
Andaman and Nicobar Islands: అండమాన్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంతంటే..