AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andaman and Nicobar Islands: అండమాన్‌ దీవుల్లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత ఎంతంటే..

అండమాన్‌ దీవుల్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో అండమాన్‌లోని పోర్ట్‌ బ్లెయిర్‌లో భూమి కంపించింది

Andaman and Nicobar Islands: అండమాన్‌ దీవుల్లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత ఎంతంటే..
Basha Shek
|

Updated on: Dec 29, 2021 | 12:04 PM

Share

అండమాన్‌ దీవుల్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో అండమాన్‌లోని పోర్ట్‌ బ్లెయిర్‌లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.3గా రికార్డైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకటించింది. పోర్ట్‌ బ్లెయిర్‌కు 165 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. అయితే భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎన్‌సీఎస్‌ తెలిపింది.

కాగా నిన్న (డిసెంబర్‌28) జమ్మూ కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.8 గా నమోదైంది. అంతకుముందు డిసెంబర్‌ 26న హిమాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, తమిళనాడు, ఏపీ లోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. కాగా అండమాన్ నికోబార్ దీవుల్లో వరుస భూ ప్రకంపనలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సెప్టెంబర్‌ మాసంలోనూ రెండు సార్లు ఇలాగే భూమి కంపించింది. వీటి వల్ల పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకపోయినా ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

Also Read:

Harnaaz sandhu: నాకు ఆ నటినే ఇన్‌స్పిరేషన్‌.. అవకాశం వస్తే ఆమె బయోపిక్‌లో నటించాలనుకుంటున్నా.. మిస్‌ యూనివర్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Viral video: పర్యాటకుల ముందే కుక్కపై పంజా విసిరిన పులి.. భయంతో కేకలు పెట్టిన టూరిస్టులు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Viral Video: భోజనం చేస్తున్నప్పుడు మాస్క్‌ ఎందుకు పెట్టుకోలేదని వృద్ధుడిని చితక బాదిన మహిళ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..