AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: ఒమిక్రాన్‌‌‌ ఇన్ఫెక్షన్‌లతో డెల్టాకు చెక్.. సౌతాఫ్రికా నిపుణుల తాజా అధ్యయనంలో సంచలనాలు!

ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Omicron: ఒమిక్రాన్‌‌‌ ఇన్ఫెక్షన్‌లతో డెల్టాకు చెక్.. సౌతాఫ్రికా నిపుణుల తాజా అధ్యయనంలో సంచలనాలు!
Omicron
Balaraju Goud
|

Updated on: Dec 29, 2021 | 9:19 AM

Share

Covid 19 Omicron: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలవరపెడుతోంది. మొన్నటివరకు డెల్టా వేరియంట్‌ చుక్కలు చూపిస్తే.. తాజాగా ఒమిక్రాన్‌ భయంతో వణికిపోతున్నాయి. డెల్టాతో పోలిస్తే వేగంగా వ్యాపిస్తుండటంతో రోగనిరోధక శక్తిని తగ్గుస్తుందన్నట్లు నివేదికలు వస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా వచ్చిన ఓ అధ్యయనం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు. తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.

ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో కొన్ని ప్రతిరోధకాలను తప్పించుకోగలదని తేలింది. రెండు వారాల తర్వాత వ్యాధి నుండి వచ్చే ఇన్ఫెక్షన్లకు రోగనిరోధక శక్తి 14 రెట్లు పెరిగింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌కు చెందిన అలెక్స్ సిగల్, ఖదీజా ఖాన్ నేతృత్వంలోని ఆఫ్రికా హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ సోకిన వారిలో డెల్టాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మెరుగైన స్థాయిలో పెరుగుతున్నట్లు గుర్తించింది. ఒకవేళ ఇదే కొనసాగితే డెల్టాతో రీ-ఇనఫెక్షన్‌ బారినపడకుండా కాపాడడంతో పాటు తీవ్రవ్యాధి నుంచి రక్షణ కల్పించడంలో ఒమిక్రాన్‌ దోహదం చేస్తున్నట్లు అంచనా వేసింది.

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తి, ప్రభావాలను అంచనా వేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఒమిక్రాన్‌ సోకిన ఓ 33 మందిపై దక్షిణాఫ్రికా నిపుణులు అధ్యయనం చేపట్టారు. వ్యాక్సిన్‌ తీసుకున్న, తీసుకోని వారిని పరిగణనలోకి తీసుకున్నారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో డెల్టాను తటస్థీకరించే సామర్థ్యం పెరిగినట్లు గుర్తించారు. దీనర్థం మరోసారి డెల్టా సోకే సామర్థ్యం తగ్గడమేనని అధ్యయనం చేసిన నిపుణులు వెల్లడించారు. మనం అదృష్టవంతులైతే, ఒమిక్రాన్ తక్కువ వ్యాధికారకమైనది, ఈ రోగనిరోధక శక్తి డెల్టాను బయటకు నెట్టడానికి సహాయపడుతుందని సిగల్ చెప్పారు. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా బలమైన రక్షణను అందించవచ్చన్నారు. అతను గతంలో ఫైజర్ ఇంక్.. బయోఎన్‌టెక్ SE కోవిడ్-19 వ్యాక్సిన్‌తో పాటు మునుపటి ఇన్‌ఫెక్షన్‌ను రెండు-డోస్ కోర్సును ఆయన కనుగొన్నారు.

అయినప్పటికీ, డెల్టా ద్వారా ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి మళ్లీ సోకే అవకాశం పరిమితంగా ఉందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది రెండో జాతి ఉనికిని తగ్గిస్తుంది. జూలై, ఆగస్టులో డెల్టా వేరియంట్ దేశవ్యాప్తంగా వెలుగుచూసింది. దీంతో రికార్డుస్థాయిలో ప్రజలు ఆసుపత్రల పాలయ్యారు. అయితే, ఒమిక్రాన్ ఇంకా ఆరోగ్య సేవలపై అంత ప్రభావం చూపలేదు. అయితే, డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వ్యాధి తీవ్రత తక్కువగా ఉందా? లేదా అనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కొవిడ్‌ తీవ్రత తగ్గే అవకాశాలు అధికంగా ఉంటాయని వెల్లడించారు. ఇలా దక్షిణాఫ్రికా అనుభవాలను బట్టి ఒమిక్రాన్‌ తక్కువ వ్యాధికారకమైనదే అయితే.. డెల్టాను పారద్రోలడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని ఆఫ్రికా ఆరోగ్య పరిశోధనా సంస్థలోని ప్రొఫెసర్‌ అలెక్స్‌ సిగాల్‌ వెల్లడించారు. దీనివల్ల వ్యక్తిగతంగాను, సమాజంపై ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం భారీగా తగ్గిపోతుందని అంచనా వేశారు.

ఇదిలాఉంటే, డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల ఆస్పత్రుల్లో చేరికలు, వ్యాధి తీవ్రత ముప్పు తక్కువగానే ఉన్నట్లు దక్షిణాఫ్రికా నుంచి వెలువడ్డ పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు 130 దేశాలకు విస్తరించగా కొన్ని దేశాల్లో మాత్రమే కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా వైరస్‌ లక్షణాలు కూడా డెల్టాతో పోలిస్తే స్వల్పంగానే ఉంటున్నట్లు ఇప్పటివరకు ఉన్న సమాచారం బట్టి తెలుస్తోంది.

Read Also… Calcium Rich Foods: కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? అయితే, ఈ పదార్థాలను మీ ఆహారంలో చేర్చాల్సిందే..!