Harnaaz sandhu: నాకు ఆ నటినే ఇన్‌స్పిరేషన్‌.. అవకాశం వస్తే ఆమె బయోపిక్‌లో నటించాలనుకుంటున్నా.. మిస్‌ యూనివర్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్ కిరీటం అందించింది హర్నాజ్‌ సంధూ. తన అందం, సమయస్ఫూర్తితో సుస్మితా సేన్‌, లారాదత్తాల తర్వాత ఈ ఘనత

Harnaaz sandhu: నాకు ఆ నటినే ఇన్‌స్పిరేషన్‌.. అవకాశం వస్తే ఆమె బయోపిక్‌లో నటించాలనుకుంటున్నా.. మిస్‌ యూనివర్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 29, 2021 | 11:30 AM

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్ కిరీటం అందించింది హర్నాజ్‌ సంధూ. తన అందం, సమయస్ఫూర్తితో సుస్మితా సేన్‌, లారాదత్తాల తర్వాత ఈ ఘనత సాధించిన బ్యూటీ క్వీన్‌గా అరుదైన గుర్తింపు పొందింది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఇజ్రాయెల్‌ వెళ్లిన హర్నాజ్‌ 80 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి మరీ ‘మిస్ యూనివర్స్ 2021’ టైటిల్‌ సొంతం చేసుకుంది. కాగా ఈ అందాల పోటీలకు ముందే వెండితెరపై అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది హర్నాజ్‌. పోలీవుడ్‌( పంజాబీ చిత్ర పరిశ్రమ)లో ‘బాయి జీ కుట్టంగే’ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో ఆమె నటిస్తోంది. దీంతో పాటు ‘యారన్ దియాన్ పో బారా’ అనే మరో పంజాబీ సినిమాకు కూడా అంగీకారం తెలిపింది హర్నాజ్‌. కాగా విశ్వసుందరి కిరీటం అందుకున్నాక వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతోందీ సొగసరి. ఈనేపథ్యంలో తన అభిరుచులు, ఇష్టాయిష్టాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌తో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సినిమా కెరీర్‌ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. తాజాగా ఓ సందర్భంలో మాట్లాడుతూ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బయోపిక్‌లో నటించాలని ఉన్నట్లు పేర్కొంది. ‘ప్రియాంక వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం నాతో పాటు చాలామందికి స్ఫూర్తినిస్తుంది. అవకాశం వస్తే ఆమె జీవిత చరిత్రపై వచ్చే సినిమాల్లో నటించాలని ఉంది’ అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఇటీవల విడుదలైన ఓ వీడియోలో కూడా ‘నాకు ప్రియాంక అంటే ఎంతో ఇష్టం. ఆమె నుంచే నేను జీవితానికి సంబంధించిన ఎన్నో పాఠాలను నేర్చుకున్నాను. పీసీనే నాకు ఎప్పుడూ ఇనిస్పిరేషన్‌ ‘ అంటూ తెలిపింది. కాగా గతంలో ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారాదత్తా, మానుషి చిల్లర్ కూడా మోడలింగ్‌ ఆపై అందాల పోటీల్లో ప్రతిభ చాటిన తర్వాతే వెండితెరకు పరిచయమయ్యారు.