AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: భారత్ విజయానికి 6 వికెట్లు.. సఫారీలకు 211 పరుగులు.. వెయిట్ అండ్ సీ

సెంచూరియాన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న మొదటి టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే...

IND vs SA: భారత్ విజయానికి 6 వికెట్లు.. సఫారీలకు 211 పరుగులు.. వెయిట్ అండ్ సీ
Ind Vs Sa
Ravi Kiran
|

Updated on: Dec 29, 2021 | 9:42 PM

Share

India vs South Africa 1st Test Highlights: భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. రేపు భారత్‌కు విజయం దక్కాలంటే 6 వికెట్లు కావాల్సి ఉండగా.. సౌతాఫ్రికా 211 పరుగులు చేయాల్సి ఉంది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో రబాడా, జాన్సెన్ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. ఎనిగిడి 2 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌‌తో కలిపి భారత్‌కు 304 పరుగుల ఆధిక్యం దక్కింది. దీనితో ఈ మ్యాచ్‌లో గెలవాలంటే సఫారీలు 305 పరుగులు చేయాల్సి ఉంది. 

సెంచూరియాన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న మొదటి టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే సఫారీలను కట్టడి చేసి భారీ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా నాలుగో రోజు ఆటను కొనసాగిస్తోంది. ఈరోజు దాదాపు మూడు సెషన్లు భారత్ ఆడితే.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్ నిర్దేశించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(4) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం శార్దూల్ ఠాకూర్(10) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. సఫారీ బౌలర్లలో రబాడా, జాన్సెన్ చెరో వికెట్ పడగొట్టారు.

అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియాను ఎనిగిడి 6 వికెట్లు తీసి.. రబాడా 3 వికెట్లు తీసి వెన్ను విరిచాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్‌‌లో సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 197 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమి 5 వికెట్లు, శార్దుల్‌ 2 వికెట్లు, బుమ్రా, సిరాజ్‌, చెరో వికెట్ పడగొట్టారు.

భారత్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛటీశ్వర్ పుజారా, అజింక్యా రహనే, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్

సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), మార్కరమ్, పీటర్సన్, డుస్సెన్, బవుమా, డికాక్(వికెట్ కీపర్), ముల్దర్, జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, ఎనిగిడి

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 29 Dec 2021 09:41 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. రేపు భారత్‌కు విజయం దక్కాలంటే 6 వికెట్లు కావాల్సి ఉండగా.. సౌతాఫ్రికా 211 పరుగులు చేయాల్సి ఉంది.

  • 29 Dec 2021 09:33 PM (IST)

    అర్ధ సెంచరీ సాధించిన ఎల్గర్..

    305 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో భాగంగా సౌతాఫ్రికా మంచి ఆరంభాన్ని అందుకుంది. కెప్టెన్ డీన్ ఎల్గర్(51) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు.

  • 29 Dec 2021 09:19 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..

    సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో డుస్సెన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. దీనితో 74 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది.

  • 29 Dec 2021 08:11 PM (IST)

    అర్ధ సెంచరీ దాటిన సఫారీ స్కోర్..

    రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్కోర్ అర్ధ సెంచరీ దాటింది. రెండు వికెట్లు పడిపోయినప్పటికీ.. డుస్సెన్(8), ఎల్గర్(25) క్రీజులో ఉన్నారు.

  • 29 Dec 2021 07:32 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా సెకండ్ వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో పీటర్సన్(17) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీనితో 34 పరుగుల స్కోర్ వద్ద సఫారీలు రెండో వికెట్ కోల్పోయింది.

  • 29 Dec 2021 07:04 PM (IST)

    టీ బ్రేక్..

    రెండో ఇన్నింగ్స్‌ టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. మార్కరమ్(1) త్వరగా పెవిలియన్ చేరగా.. ఎల్గర్(9), పీటర్సన్(12) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా 9 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.

  • 29 Dec 2021 06:14 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన సఫారీలు

    రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. మార్కారమ్(1) షమీ బౌలింగ్‌లో బౌల్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీనితో దక్షిణాఫ్రికా 1 పరుగు వద్ద 1 వికెట్ కోల్పోయింది.

  • 29 Dec 2021 06:05 PM (IST)

    8 పరుగుల వ్యవధిలో చివరి రెండు వికెట్లు..

    టీమిండియా చివరి రెండు వికెట్లు 8 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. దీనితో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో రబాడా, జాన్సెన్ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. ఎనిగిడి 2 వికెట్లు తీశాడు.

  • 29 Dec 2021 05:39 PM (IST)

    ఎనిమిదో వికెట్ పడింది.. ఆధిక్యం 300కి చేరువైంది..

    టీమిండియా ఎనిమిదో వికెట్ నష్టపోయింది. 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీనితో 166 పరుగుల వద్ద భారత్ 8వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం బుమ్రా(2), షమీ(0) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 298 పరుగులు.

  • 29 Dec 2021 05:25 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. రబాడా బౌలింగ్‌‌లో క్యాచ్‌ అవుట్‌గా అశ్విన్(14) పెవిలియన్ చేరాడు. దీనితో భారత్ 146 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంత్(19), షమీ(0) క్రీజులో ఉన్నారు.

  • 29 Dec 2021 05:05 PM (IST)

    టీమిండియా ఆధిక్యం 262 పరుగులు..

    రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా దూసుకుపోతోంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు చక్కటి భాగస్వామ్యాలు నమోదు అవుతుండటంతో భారత్ ఆధిక్యం 250 పరుగులు దాటింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(16), అశ్విన్(8) ఉన్నారు. 42 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దీనితో టీమిండియా ఆధిక్యం 262 పరుగులకు చేరుకుంది.

  • 29 Dec 2021 04:48 PM (IST)

    రహనే మెరుపులు ముగిశాయి..

    టీమిండియా 6వ వికెట్ కోల్పోయింది. అజింక్యా రహనే(20) మెరుపులు ముగిశాయి. జాన్సెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రహనే.. టాప్ ఎడ్జ్‌కు తగిలి బౌండరీ దగ్గర ఉన్న డుస్సెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో 111 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. ఇక టీమిండియా ఆధిక్యం 241 పరుగులు.

  • 29 Dec 2021 04:43 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఎనిగిడి బౌలింగ్ పుజారా(16) వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీనితో భారత్ 109 పరుగుల దగ్గర 5వ వికెట్ కోల్పోయింది. అయితే అప్పటికే టీమిండియా ఆధిక్యం 239 కాగా.. కోహ్లిసేన 300 దిశగా అడుగులు వేస్తోంది.

  • 29 Dec 2021 04:37 PM (IST)

    4,6,4… దుమ్మురేపిన రహనే..

    జాన్సెన్ వేసిన 37వ ఓవర్‌లో అజింక్యా రహనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వరుస బంతుల్లో 4,6,4.. బాదాడు. దీనితో ఆ ఓవర్‌లో భారత్ 14 పరుగులు రాబట్టింది. ఇదిలా ఉంటే 37 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 109/4 పరుగులు చేయగా.. ఆధిక్యం 239 పరుగులకు చేరుకుంది.

  • 29 Dec 2021 04:16 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(18) చక్కటి డ్రైవ్ ఆడబోయి వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి జాన్సెన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీనితో టీమిండియా 79 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోగా.. జాన్సెన్ తన ఖాతాలోకి మరో వికెట్ వేసుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం 209 పరుగులు.

  • 29 Dec 2021 03:43 PM (IST)

    లంచ్ బ్రేక్.. భారత్ ఆధిక్యం 209 పరుగులు..

    మొదటి టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. 130 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన భారత్ అద్భుతమైన ఆటతీరును కనబరిచి దూసుకుపోతోంది. మూడు వికెట్లు పడగా.. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ(18), పుజారా(12) క్రీజులో ఉన్నారు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 32 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 79 పరుగులు చేసింది.

  • 29 Dec 2021 03:30 PM (IST)

    భారత్ ఆధిక్యం 200 పరుగులు దాటింది..

    రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(18), పుజారా(12) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ఆధిక్యం 209 పరుగులు దాటింది.

  • 29 Dec 2021 02:54 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్..

    తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కెఎల్ రాహుల్(23) పెవిలియన్ చేరాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎనిగిడి బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనితో టీమిండియా 54 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 184 పరుగులు.

  • 29 Dec 2021 02:42 PM (IST)

    డ్రింక్స్ బ్రేక్.. ఇండియా- 50/2

    రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆచితూచి ఆడుతోంది. 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్.. ప్రస్తుతం 180 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. మయాంక్ అగర్వాల్(4), శార్దూల్ ఠాకూర్(10) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. ప్రస్తుతం పుజారా(7), రాహుల్(19) క్రీజులో ఉన్నారు. ఇక డ్రింక్స్ బ్రేక్ వచ్చేసరికి 20 ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.

  • 29 Dec 2021 02:38 PM (IST)

    శార్దూల్ ఠాకూర్(10) ఔట్..

    16/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. నైట్ వాచ్‌మెన్ శార్దూల్ ఠాకూర్(10).. రబాడా బౌలింగ్‌లో ముల్దర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీనితో 34 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఛటీశ్వర్ పుజారా(7), కెఎల్ రాహుల్(19) క్రీజులో ఉన్నారు.

Published On - Dec 29,2021 2:33 PM

అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్