Wasim Jaffer vs Michael Vaughan: వసీం జాఫర్, మైకేల్ వాన్ మధ్య ట్విట్టర్ యుద్ధం.. వీడియో వైరల్..
భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మధ్య ట్విట్టర్ యుద్ధం జరుగుతోంది. ఎవరికి అవకాశం వస్తే వారు ట్విట్టర్లో ఒకరిపై ఒకరు పోస్టు చేసుకుంటున్నారు...
భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మధ్య ట్విట్టర్ యుద్ధం జరుగుతోంది. ఎవరికి అవకాశం వస్తే వారు ట్విట్టర్లో ఒకరిపై ఒకరు పోస్టు చేసుకుంటున్నారు. అయితే ఈసారి జాఫర్‌కు అవకాశం వచ్చింది. ఈ సమయంలో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటనలో యాషెస్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో తొలి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ దారుణంగా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లీష్ ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 68 పరుగులకే ఆలౌట్ అయింది. దీనిపై వసీం జాఫర్ ట్వీట్ చేశాడు.
2019లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో నాలుగో వన్డేలో హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 92 పరుగులకు ఆలౌటైంది. దీనిపై వాన్ ట్వీట్ చేశారు. భారత్ 92 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యిందని వాన్ ట్వీట్ చేశాడు. ఈ రోజుల్లో ఒక జట్టు 100 పరుగుల లోపు ఔట్ అవుతుందంటే నమ్మడం కష్టమన్నాడు.
మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కేవలం 68 పరుగులకే ఆలౌట్ అయినప్పుడు జాఫర్ వాన్ పాత ట్వీట్ చూపిస్తూ “ఇంగ్లాండ్ 68 పరుగులకు ఆలౌట్ అయింది. మైఖేల్ వాన్.” అంటూ వీడియోను ట్వీట్ చేశాడు.
మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి మ్యాచ్‌ను గెలుచుకోవడంతోపాటు యాషెస్ సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో ఎక్కడా పోటీ పడలేకపోయింది. ఇంగ్లీష్ జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ ఆతిథ్య జట్టుకు పోటీగా కనిపించలేదు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ అత్యంత నిరాశపరిచింది. ఎంసీజీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌లో అరంగేట్రం చేసిన స్కాట్ బోలాండ్ కీలక పాత్ర పోషించాడు. కేవలం నాలుగు ఓవర్లు వేసి ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
England 68 all out @MichaelVaughan ? #Ashes pic.twitter.com/lctSBLOsZK
— Wasim Jaffer (@WasimJaffer14) December 28, 2021