AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: అలర్ట్‌..! ఒమిక్రాన్‌కి సంబంధించి WHO 7 హెచ్చరికలు జారీ..?

Omicron: భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో Omicron వేగంగా అభివృద్ధి చెందుతోంది. WHO నివేదిక ప్రకారం.. UK, USలోని

Omicron: అలర్ట్‌..! ఒమిక్రాన్‌కి సంబంధించి WHO 7 హెచ్చరికలు జారీ..?
Omicron
uppula Raju
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 29, 2021 | 12:57 PM

Share

Omicron: భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో Omicron వేగంగా అభివృద్ధి చెందుతోంది. WHO నివేదిక ప్రకారం.. UK, USలోని ఓమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే ప్రమాదకరమైనది. అయితే నవంబర్ 24న మొదటిసారిగా ఈ వేరియంట్‌ని గుర్తించిన దేశం దక్షిణాఫ్రికా. ఇప్పుడు అక్కడ ఓమిక్రాన్ కేసుల సంఖ్య తగ్గుదలని సూచిస్తోంది. ఇది శుభపరిణామం. తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌కి సంబంధించి WHO ఏడు హెచ్చరికలను జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం.

1. జెనీవాలో జరిగిన సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. Omicron వేరియంట్‌ ఇంతకు ముందు ఏ వేరియంట్‌లో చూడని విధంగా వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు.

2. ఇన్ఫెక్షన్ సోకిన 24 గంటల తర్వాత డెల్టా, SARS-CoV-2 వైరస్ కంటే Omicron 70 రెట్లు వేగంగా శరీరంలో వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు నివేదించారు.

3. Omicronపై వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తల బృందం గొప్ప సమాచారాన్ని తెలిపింది. రష్యా గామ్లయా సెంటర్ నిర్వహించిన ప్రాథమిక ప్రయోగశాల అధ్యయనం ఆధారంగా స్పుత్నిక్ లైట్ బూస్టర్ డోస్ ఈ వేరియంట్‌పై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.

4. యునైటెడ్ కింగ్‌డమ్, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. డెల్టా వెర్షన్ కంటే ఓమిక్రాన్‌కు ఆసుపత్రిలో చేరే ప్రమాదం తక్కువగా ఉందని సూచిస్తుంది.

5. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఓమిక్రాన్ వేరియంట్‌ను తటస్థీకరించే సామర్థ్యం తక్కువగా ఉండవచ్చని ప్రాథమిక డేటా సూచిస్తుంది.

6. టీకాలు వేసుకున్న వారిలో డెల్టా వేరియంట్‌కు రోగనిరోధక శక్తి పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి.

7. Omicron పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులలో కూడా వ్యాప్తి చెందుతుందని WHO తెలిపింది.కరోనా డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ వేరియంట్ మూడు రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ ద్వారా తెలిపింది. ఈ పరిస్థితిలో ప్రపంచంలోని అనేక దేశాలు దక్షిణాఫ్రికా, బోట్స్వానా వంటి దేశాలకు ప్రయాణాన్ని నిషేధించాయి. ఇక్కడ ఒమిక్రాన్‌ వేరియంట్‌కి సంబంధించి గరిష్ట సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో భద్రత దృష్ట్యా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులను కఠినమైన స్క్రీనింగ్ పరీక్షలకు భారత ప్రభుత్వం ఆదేశించింది.

Boy from Bachpan ka Pyaar: సోషల్ మీడియాను షేక్ చేసిన బాలుడికి రోడ్డుప్రమాదం.. తీవ్రగాయాలు..

Army School Jobs: సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Crime News: జగద్గిరిగుట్ట లో దారుణం.. క్షణికావేశంలో మామను హత్య చేసిన అల్లుడు..!