AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: జగద్గిరిగుట్ట లో దారుణం.. క్షణికావేశంలో మామను హత్య చేసిన అల్లుడు..!

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మల్కాజ్‌గిరి మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో మామను హత్య చేసాడు అల్లుడు.

Crime News: జగద్గిరిగుట్ట లో దారుణం.. క్షణికావేశంలో మామను హత్య చేసిన అల్లుడు..!
Balaraju Goud
|

Updated on: Dec 29, 2021 | 10:20 AM

Share

Hyderabad Man kills Father in law: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మల్కాజ్‌గిరి మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో మామను హత్య చేసాడు అల్లుడు. జగద్గిరిగుట్ట సంజయ గాంధీ నగర్ కు చెందిన నరసింహ (50) గత రాత్రి పాపిరెడ్డి నగర్ లో నివాసముండే తన అల్లుడు బాలకృష్ణ (23) ఇంటికి వెళ్లాడు. బాలకృష్ణ తండ్రి అక్రమ సంబంధం విషయమై నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన బాలకృష్ణ.. తన మామ నరసింహ మెడపై కత్తితో దాడి చేశాడు.

దీంతో తీవ్రంగా గాయపడ్డ అతన్ని కుటుంబసభ్యులు చింతల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు బాలకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Read Also…  Viral video: పర్యాటకుల ముందే కుక్కపై పంజా విసిరిన పులి.. భయంతో కేకలు పెట్టిన టూరిస్టులు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..