AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boy from Bachpan ka Pyaar: సోషల్ మీడియాను షేక్ చేసిన బాలుడికి రోడ్డుప్రమాదం.. తీవ్రగాయాలు..

సోషల్ మీడియా అందుటులోకి వచ్చిన తర్వాత ఫెమస్ అవ్వడం చాలా ఈజీ అయ్యిపోయింది.పదిమందిలో మనలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టక పోయిన మన ఫోన్ లో..

Boy from Bachpan ka Pyaar:  సోషల్ మీడియాను షేక్ చేసిన బాలుడికి రోడ్డుప్రమాదం.. తీవ్రగాయాలు..
Rajeev Rayala
|

Updated on: Dec 29, 2021 | 10:26 AM

Share

Boy from Bachpan ka Pyaar: సోషల్ మీడియా అందుటులోకి వచ్చిన తర్వాత ఫెమస్ అవ్వడం చాలా ఈజీ అయ్యిపోయింది.పదిమందిలో మనలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టక పోయిన మన ఫోన్ లో ఉన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు రాత్రికి రాత్రే క్రేజ్ పాపులర్ అయ్యిపోవచ్చు ఈ బాలుడి కూడా అలానే పాపులర్ అయ్యాడు. ‘జానే మేరీ జానే మన్.. బచ్‌పన్‌ కా ప్యార్‌’ పాటతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన బాలుడు సహ్‌దేవ్‌ దిర్దో. తాజాగా ఈ బాలుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం సాయంత్రం సహ్‌దేవ్‌ కు ప్రమాదం జరిగింది. అతడు బైక్ పై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడటంతో సహ్‌దేవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

సహ్‌దేవ్‌ను తొలుత సుక్మా జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జగ్‌దల్‌పూర్‌ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. సహ్‌దేవ్‌ కు రోడ్డు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ వినీత్‌ నందన్‌వర్‌, ఎస్పీ సునీల్‌ శర్మ సహ్‌దేవ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సహ్‌దేవ్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ అధికారులను ఆదేశించారు. సుక్మా జిల్లాకు చెందిన సహ్‌దేవ్‌.. తరగతి గదిలో ‘జానే మేరీ జానే మన్.. బచ్‌పన్‌ కా ప్యార్‌’ పాట పాడగా.. టీచర్ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. పలువురు సినిమా తారలు కూడా సహ్‌దేవ్‌ను ప్రశంసించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Atrangi Re: ధనుష్-అక్షయ్ కుమార్‌ల సినిమాను బహిష్కరించాల్సిందే.. ట్విట్టర్‌లో పెరిగిన డిమాండ్.. ఎందుకంటే?

RRR Pre Invite Poster: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.. నెట్టింట్లో పంచుకున్న తరణ్ ఆదర్స్..!

Spider-Man: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లు.. ఏ సినిమా ఎంత కలెక్షన్ కొల్లగొట్టిందంటే..