Vijay Devarakonda’s Liger: అప్‌డేట్‌తో అదరగొట్టిన ‘లైగర్’.. అంచనాలు అమాంతం పెంచేసిన వీడియో..

డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్.. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా లైగర్. ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు విజయ్.

Vijay Devarakonda's Liger: అప్‌డేట్‌తో అదరగొట్టిన 'లైగర్'.. అంచనాలు అమాంతం పెంచేసిన వీడియో..
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2021 | 12:57 PM

Vijay Devarakonda’s Liger: డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్.. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా లైగర్. ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు విజయ్. ఛార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరీజగన్నాథ్ తనదైన మార్క్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజ్ లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు.

ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాలో నటించని మైక్ టైసన్  ను లైగర్ కోసం రంగంలోకి దింపారు పూరీ. ఇటీవలే మైక్ టైసన్ విజయ్ దేవరకొండ మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు. లైగర్ సినిమాలో మైక్ టైసన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. సినిమా కథను ఆయన పాత్రే మలుపు తిప్పుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా విడుదల కోసం విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు.. అనన్య టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అటు విజయ్.. ఇటు పూరీ జగన్నాథ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదే. ప్రస్తుతం లైగర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.  ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ సినిమా గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో సాగే కథ అంటూ సోషల్ మీడియాలో గుసగుసులు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో సినిమా పై అంచనాలను మరింత పెంచేందుకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను రెడీ చేశారు పూరీ అండ్ టీమ్.. ఈ మేరకు వరుస అప్డేట్స్ ను ఇవ్వనున్నారు. ఈ క్రమంలో నేడు (బుధవారం) ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ది బిగ్ అనౌన్స్మెంట్ అంటూ విడుదల చేసిన ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు.. సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. అలాగే రేపు( డిసెంబర్ 30) ఉదయం 10:03 గంటలకు బీటీఎస్ స్టిల్స్ ని విడుదల చేయనున్నారు.. అలాగే సాయంత్రం 4:00 గంటలకు స్పెషల్ ఇన్ స్టా ఫిల్టర్ ని విడుదల చేస్తామని ఫైనల్ గా డిసెంబర్ 31 న `లైగర్` ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఓ టైం టేబుల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Atrangi Re: ధనుష్-అక్షయ్ కుమార్‌ల సినిమాను బహిష్కరించాల్సిందే.. ట్విట్టర్‌లో పెరిగిన డిమాండ్.. ఎందుకంటే?

RRR Pre Invite Poster: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.. నెట్టింట్లో పంచుకున్న తరణ్ ఆదర్స్..!

Spider-Man: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లు.. ఏ సినిమా ఎంత కలెక్షన్ కొల్లగొట్టిందంటే..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..