NTA CMAT Registration 2022: CMAT పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ఎప్పుడు..? తాజా అప్‌డేట్ తెలుసుకోండి..
NTA CMAT Registration 2022: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) CMAT పరీక్ష 2022 కోసం రిజిస్ట్రేషన్ విండో త్వరలో ఓపెన్ చేయనుంది. CMAT
NTA CMAT Registration 2022: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) CMAT పరీక్ష 2022 కోసం రిజిస్ట్రేషన్ విండో త్వరలో ఓపెన్ చేయనుంది. CMAT రిజిస్ట్రేషన్ 2022 cmat.nta.nic.inలో ప్రారంభమవుతుంది. కామన్ మేనేజ్‌మెంట్ టెస్ట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీలో 50% మార్కులు ఉన్న విద్యార్థులు CMAT 2022 దరఖాస్తు ఫారమ్ నింపడానికి అర్హులు. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే.
రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి 1. cmat.nta.nic.inలో CMAT అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2. ‘అప్లై ఫర్ CMAT 2022’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. 3. న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు న్యూ క్యాండెట్ నమోదు కింద వివరాలన్నింటినీ అందించాలి. 4. మీ లాగిన్ ID, పాస్‌వర్డ్ రూపొందిస్తుంది. 5. అభ్యర్థులు మళ్లీ లాగిన్ చేసి CMAT 2022 రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి. 6. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. 7. CMAT అప్లికేషన్ రుసుము చెల్లించాలి. 8. CMAT 2022 దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్తు సూచన కోసం ప్రింట్‌అవుట్‌ను తీసుకోండి.
CMAT నమోదు 2022 కోసం అవసరమైన పత్రాలు 1. చెల్లుబాటు అయ్యే ఫోన్ నంబర్ & ఈ మెయిల్ ID 2. స్కాన్ చేయబడిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో 3. స్కాన్ చేసిన సంతకం 4. క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వివరాలు
అర్హత వివరాలు CMAT 2022 పరీక్ష అనేది AICTE ఆమోదించిన మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో MBA/PGDMలో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రవేశ పరీక్ష. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితమైనది. దీనికి 3 గంటల సమయం కేటాయిస్తారు. CMAT 2022లో అధిక స్కోర్ పొందడం వల్ల 1000 AICTE ఆమోదించిన MBA / PGDM కళాశాలల్లో MBA ప్రవేశానికి అవకాశం లభిస్తుంది.