Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుమ్మడికాయ గింజలు కనిపిస్తే అస్సలు వదలద్దు..! నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Pumpkin Seeds Benefits: మీరు అప్పుడప్పుడు గుమ్మడికాయ కూరని తింటూ ఉంటారు. కానీ దాని విత్తనాల గురించి మీకు తెలుసా.. ఆశ్చర్యపోతారు.

గుమ్మడికాయ గింజలు కనిపిస్తే అస్సలు వదలద్దు..! నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Pumpkin
Follow us
uppula Raju

|

Updated on: Dec 29, 2021 | 1:51 PM

Pumpkin Seeds Benefits: మీరు అప్పుడప్పుడు గుమ్మడికాయ కూరని తింటూ ఉంటారు. కానీ దాని విత్తనాల గురించి మీకు తెలుసా.. ఆశ్చర్యపోతారు. గుమ్మడి గింజల్లో విటమిన్ ఎ, సి, ఈ, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ మొదలైన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరంలో పోషకాల కొరత ఉండదు. దీని వల్ల మీరు అన్ని వ్యాధుల నుంచి రక్షించబడతారు. గుమ్మడి గింజల్లో పోషకాలు అధికం. ఒకవేళ మీరు గుమ్మడికాయను ఇష్టపడకపోతే దానిని తినకండి కానీ దాని విత్తనాలను ఖచ్చితంగా తినండి. మీరు గుమ్మడికాయ గింజలను నీటిలో నానబెట్టడం, మొలకెత్తడం, సలాడ్‌లు, సూప్‌లు, తీపి వంటకాలకు కలుపుకొని తినవచ్చు. కావాలంటే ఎండబెట్టి పొడి చేసి తినొచ్చు. గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. రోగనిరోధక శక్తిని పెంచుతాయి ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. గుమ్మడికాయ గింజలు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఈ రక్తనాళాలను బలపరుస్తుంది.

2. గుండెజబ్బులకు చెక్ రోజూ ఒక చెంచా గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మీ చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలా చేస్తే గుండెకు సంబంధించిన అన్ని సమస్యలు అదుపులో ఉంటాయి. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారు తప్పనిసరిగా గుమ్మడి గింజలను తీసుకోవాలి.

3. ఎముకలకు మేలు చేస్తుంది గుమ్మడి గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే ఎముకలు దృఢంగా ఉండి బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

4. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది ఆయుర్వేదంలో అన్ని రోగాలకు మూలం పొట్ట. కానీ గుమ్మడికాయ గింజలు కడుపుకు చాలా మంచివిగా భావిస్తారు. అవి మన జీర్ణవ్యవస్థను సరిచేయడానికి పని చేస్తాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.

5. కళ్లకు మేలు చేస్తుంది విటమిన్ ఎ, ఈ గుమ్మడికాయ గింజలలో ఉంటాయి. ఇవి కళ్ళకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇది కళ్లను రక్షిస్తుంది కళ్లకు రంగును అందిస్తుంది. వీటిని తింటే కంటిచూపు మెరుగవుతుంది.

వాహనదారులకు శుభవార్త.. ఖరీదైన పెట్రోల్‌, డీజిల్‌ నుంచి విముక్తి.. ఎలాగంటే..?

Egg News: రోజు ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తింటున్నారా..! తాజా అధ్యయనంలో సంచలన నిజాలు..

FSSAI Admit Card 2022: ఫుడ్ అనలిస్ట్ పోస్టుల అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..