Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Semolina Halwa Recipe: పిల్లలు స్వీట్ అని మారాం చేస్తున్నారా.. ఉప్మా రవ్వతో హల్వా ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..

పూజ సమయంలో కొంతమంది దేవుడికి ప్రసాదంగా స్వీట్లు సమర్పించాలనుకుంటారు. అంతేకాదు ఎప్పుడైనా ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఏదైనా స్వీట్ ని చేసి పెట్టమని అడుగుతారు. అప్పుడు సింపుల్ గా ఈ హల్వాని తయారు చేసి పెట్టండి. రుచికరమైన ఈ హల్వాని అందరూ ఇష్టంగా తింటారు. ఈ రోజు హల్వా రెసిపీ తెలుసుకుందాం..

Semolina Halwa Recipe: పిల్లలు స్వీట్ అని మారాం చేస్తున్నారా.. ఉప్మా రవ్వతో హల్వా ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..
Semolina Halwa
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2025 | 9:22 PM

ఇంట్లో ఎవరైనా స్వీట్ తినాలి ఉందని అంటే వెంటనే సేమ్యా, రవ్వ పాయసం వంటి వాటిపై దృష్టి సారిస్తారు. ఎక్కువ మంది ఉప్మా రవ్వతో చేసే హల్వాని ఇష్టంగా తింటారు. అంతేకాదు చేయడం కూడా చాలా ఈజీ. రుచికరంగా కూడా ఉంటుంది. వాస్తవంగా ఈ సెమోలినా రవ్వతో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేసుకోవచ్చు. కానీ అన్నిటిలో హల్వా బెస్ట్ అని అంటారు తీపి అంటే ఇష్టం ఉన్నవారు. ప్రతి ఒక్కరి ఇంట్లో సుజి రవ్వ ఉంటుంది. దీంతో హల్వా చేసే రెసిపీ కూడా చాలా సులభం.. అయితే ఈ హల్వా చేసే సమయంలో కొన్ని చిన్న చిన్న విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ హల్వా చాలా రుచికరంగా ఉంటుంది. మీ ప్రియమైన వారిని సంతోషపెట్టడానికి.. ఈ పద్ధతిని ఉపయోగించి హల్వా తయారు చేసి అందించండి. రెసిపీ ఏమిటో చూద్దాం.

హల్వా తయారీకి కావలసిన పదార్థాలు

సెమోలినా (సుజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ) – ఒక కప్పు

దేశీ నెయ్యి- ఒక కప్పు

ఇవి కూడా చదవండి

పాలు- రెండు కప్పుల

బాదం- 8-10

జీడిపప్పు – 8-10

డ్రై ఫ్రూట్స్

చక్కెర లేదా బెల్లం- పావు కప్పు

యాలకుల పొడి – ఒక స్పూన్

తయారీ విధానం: ముందుగా సుజీ రావ్వని శుభ్రం చేసి దానిని పాలలో నానబెట్టండి. ఇప్పుడు పాన్‌ ని స్టవ్ మీద పెట్టి వేడి చేసి అందులో కొంచెం నెయ్యి వేసి వేడి ఎక్కిన తర్వాత తరిగిన బాదం, జీడిపప్పు, ఇతర డ్రై ఫ్రూట్స్‌ వేసి వేయించండి. డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత.. వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. మిగిలిన నెయ్యిని పాన్‌లో వేసి దానిలో చక్కెర లేదా బెల్లం వేసి కరిగించండి. ఇప్పుడు నానబెట్టిన సుజీ రవ్వని పాలలో వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుతూ.. రవ్వ బంగారు గోధుమ రంగులోకి మారడం ప్రారంభించే వరకు వేయించాలి. ఇప్పుడు తీసుకున్న కప్పుతో రెండున్నర రెట్లు నీరు పోసి మూతపెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించండి. హల్వా సిద్ధమైన తర్వాత పాన్ నుంచి హల్వా అంటుకోదు.. నెయ్యి విడిగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ దశలో ఈ మిశ్రమంలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపండి. చివరిగా ఇష్టమైన వారు యాలకుల పొడిని వేసి అందరికీ వేడిగా వడ్డించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?