AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almonds: బాదంతో పాటు వీటిని కలిపి తిన్నారంటే అంతే సంగతి.. ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..!

ఇది పిల్లలు పెద్దలు అందరూ తగిన మోతాదులో రోజు రాత్రి నానబెట్టి ఉదయం తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్‌తో పాటుగా మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. కానీ బాదంపప్పుతో పాటుగా కొన్ని పదార్థాలను కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం అవుతుందని మీకు తెలుసా.?

Almonds: బాదంతో పాటు వీటిని కలిపి తిన్నారంటే అంతే సంగతి.. ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..!
Almonds
Jyothi Gadda
|

Updated on: May 24, 2025 | 7:08 PM

Share

బాదం మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు అందుతాయి. బాదంపప్పు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ఇది పిల్లలు పెద్దలు అందరూ తగిన మోతాదులో రోజు రాత్రి నానబెట్టి ఉదయం తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్‌తో పాటుగా మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. కానీ బాదంపప్పుతో పాటుగా కొన్ని పదార్థాలను కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం అవుతుందని మీకు తెలుసా.

బాదంతో పాటు నిమ్మ, గ్రేప్, నారింజ వంటి పండ్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో కడుపులో గ్యాస్, గుండెలో మంట సమస్యలు కూడా వస్తాయి. ఇక బాదంతో పాటు పాలకూర, బీట్‌రూట్‌, మెంతులు కూడా తినకూడదు. వీటి వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇక బాదం తో పాటు ఫ్రై చేసిన ఆహారాలు ఆల్కహాల్ వంటివి తింటే కడుపులో గ్యాస్ మంట వంటి సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెరతో చేసిన పదార్థాలతో పాటుగా బాదంపప్పు తీసుకుంటే మరింత ప్రమాదం అంటున్నారు నిపుణులు. ప్రాసెస్ చేసిన ఆహారాలతో బాదం తింటే బరువు కూడా పెరిగి పోతారు.

పాల ఉత్పత్తులతో పాటుగా బాదం తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక జీర్ణ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. పాలకూర, బీట్‌రూట్ వంటి అధిక ఆక్సలేట్ ఆహారాలతో పాటుగా బాదం తినకూడదని చెబుతున్నారు. ఇలాంటివి తరచూ తీసుకోవటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. బాదం పప్పును సోయా ఉత్పత్తులతో కూడా కలిపి తినకూడదని చెబుతున్నారు. ఇది థైరాయిడ్ సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. బాదంపప్పుతో పాటు ఉప్పు ఉన్న ఆహారాలను కూడా తినకూడదని చెబుతున్నారు. ఇది శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతుంది. ఇది మన గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్